ఈరోజు వెర్సటైల్ యాక్టర్ విజయ్ సేతుపతి పుట్టిన రోజు సందర్బంగా, అయన నటిస్తున్న లేటెస్ట్ పూరి జగన్నాధ్ సినిమా టైటిల్ రెవీల్ చేసారు. ఈసారి గట్టిగా హిట్ కొట్టాలి అని కసి తో పని చేస్తున్న పూరి జగన్నాధ్ టీం, విజయ్ సేతుపతి ని ఒక గుద్ది వాడిగా చూపించబోతున్నారు… ఇక టైటిల్ ‘స్లం డాగ్ 33 టెంపుల్ రోడ్’ అని ఒక వీడియో గేమ్ నామ పెట్టారు… సో, మొత్తానికి ఫస్ట్ లుక్ పోస్టర్ చుస్తే, విజయ్ ఒక చేతిలో రక్తం తో తడిసిన కత్తి పట్టుకుని డబ్బులు నిండిన పెట్టలా మధ్యలో ఉన్నట్టు చూపించారు! ఆ బ్లాక్ కళ్ళజోడు తో స్టైలిష్ గా ఉన్నాడు!

ఇక స్టోరీ విషయానికి వస్తే, ఇందులో విజయ్ సేతుపతి ఒక గుడ్డివాడైన బిక్షగాడిగా ఇంకా Money Heist-style లో సినిమా ఉండబోతోందంట! మొత్తానికి ఇది ఒక కొత్త ప్రయత్నమే! అలాగే ఈ సినిమా టబు, సంయుక్త హీరోయిన్స్ కాగా, VTV గణేష్, బ్రహ్మాజీ, దునియా విజయ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు!
అలాగే ఈరోజు విజయ్ పుట్టిన రోజు సందర్బంగా, డైరెక్టర్ బుచ్చి బాబు సన, నిర్మాత ఛార్మి, సంయుక్త కూడా ఈ టైటిల్ పోస్టర్ ని షేర్ చేస్తూ, తమ హీరో కి బర్త్డే విషెస్ చెప్పారు…