WHAT IS KOKA???

Varun Tej’s Horror Comedy #KOKA Title Glimpse Releasing on January 19

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ చాల కాలంగా మంచి హిట్ సినిమా కోసం వెయిట్ చేస్తున్నాడు… అందుకే ఈసారి ఒక కొత్త కాన్సెప్ట్ మూవీ చేస్తున్నాడు! అదే హారర్–కామెడీ జానర్‌లో ఓ కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాపై ఇప్పటి నుంచే ఆసక్తి బాగా పెరిగిపోయింది ఎందుకంటే మేకర్స్ సోషల్ మీడియా లో #KOKA అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ చేస్తూ, ఇంటరెస్ట్ పెంచుతున్నారు!

ఈరోజే ఇందాకే ఈ సినిమాకు సంబంధించిన official టైటిల్ గ్లింప్స్ జనవరి 19న విడుదల కానుంది అని ప్రకటిస్తూ, ఒక చిన్న పోస్టర్ వదిలారు. ఈ తేదీ దగ్గరపడుతున్న కొద్దీ అభిమానుల్లో అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. అనౌన్స్‌మెంట్ ప్రీ–లుక్ పోస్టర్ కూడా ఈ హైప్‌కు పెద్ద కారణంగా మారింది. అందులో వరుణ్ తేజ్ పూర్తిగా కొత్తగా, స్టైలిష్‌గా, ఒకింత మిస్టీరియస్ లుక్‌లో కనిపించారు. ఈ లుక్ చూసిన వెంటనే ఫ్యాన్స్‌తో పాటు ట్రేడ్ వర్గాల్లోనూ చర్చలు మొదలయ్యాయి. కొందరైతే ఇది వరుణ్ తేజ్‌కు గట్టి కంబ్యాక్ సినిమా అవుతుందని కూడా అంటున్నారు.

ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నది మెర్లపాక గాంధీ. వినోదాత్మక కథలతో ప్రేక్షకులను అలరించడంలో ఆయనకు మంచి పేరు ఉంది. ఈ సినిమాతో ఆయన మళ్లీ తన కంఫర్ట్ జోన్ అయిన ఫన్ ఎంటర్‌టైనర్ స్టైల్‌కు తిరిగి వస్తున్నారు. అయితే ఈసారి కామెడీకి హారర్ టచ్‌ను జోడించడంతో కథపై ఆసక్తి మరింత పెరిగింది. మెర్లపాక గాంధీ నేరేటివ్ స్టైల్ ఈ జానర్‌కు బాగా సెట్ అవుతుందనే అంచనాలు ఉన్నాయి.

సంగీతాన్ని థమన్ ఎస్ అందిస్తున్నారు. ఆయన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, పాటలు ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని భావిస్తున్నారు. ముఖ్యంగా హారర్–కామెడీ సినిమాల్లో మ్యూజిక్ కీలక పాత్ర పోషిస్తుందన్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ ఇంకా ఫస్ట్ ఫ్రేమ్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇప్పటికే #KOKA హ్యాష్‌ట్యాగ్‌తో మంచి బజ్ క్రియేట్ చేసిన ఈ సినిమా గురించి జనవరి 19న విడుదలయ్యే టైటిల్ గ్లింప్స్ మరిన్ని విషయాలను బయటపెట్టనుంది.
KOKA అంటే అసలు ఏమిటి? అని తెలుసుకోవాలంటే వెయిట్ చేయక తప్పదు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *