నిర్ణీత సమయంలోపు, సకాలానికి క్రమ తప్పకుండా భోజనం చేస్తే ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉత్పన్నం కావని తన మాటలు నిరూపితం చేసిన, చేసుకొని ఆరోగ్యం గా ఉన్న విశాఖ నిరోగ జీవన సభ్యులంతా చొల్లంగి అమావాస్య ఆదివారం సందర్బంగా విశాఖ మహానగరంలో సరిగ్గా ఉదయం ఏడున్నరకు సముద్ర స్నానం ఆచరించారు. డాక్టర్ నిష్ఠల హరగోపాల్ ఆధ్వర్యంలో విశాఖ లో ఉన్న నిరోగజీవన కుటుంబ సభ్యులంతా ఈ సామూహిక సముద్ర స్నానంలో పాల్గొన్నారు.
ముందుగా డాక్టర్ హరగోపాల్ సముద్ర ఒడ్డున ఇసుకతో ధనస్సు ఆకారం వేసి సంకల్పాన్ని స్వయంగా చెప్పి, చేసి కుటుంబ సభ్యులు అనుసరించారు. అనంతరం నిరోగజీవన కుటుంబ సభ్యులు యావన్మంది సామూహికంగా సముద్ర స్నానం చేశారు. ఈ కార్యక్రమంలో చంద్రశేఖర్,లక్ష్మణరావు, రోజా,రమణి,పీఎస్ఎస్. వీ. రావు, బాబ్జీ,పద్మ, అమ్మాజీ, సాంబశివరావు,బాబు, రోజారాణి, శ్రావణి లతో పాటునిరోగజీవన సభ్యులంతా పాల్గొన్నారు.