దుల్కర్ సల్మాన్ సినిమాలంటేనే ఎదో ఒక స్పెషలిటీ ఉంటుంది కదా… అలాగే ఇప్పుడు కూడా అయన లేటెస్ట్ సినిమా ఆకాశం లో ఒక తార నుంచి హీరోయిన్ ఇంట్రడక్షన్ వీడియో చూస్తుంటే అలానే అనిపిస్తుంది…
ఇందాకే ఈ సినిమా నుంచి సాత్విక వీరవల్లి ఇంట్రడక్షన్ వీడియో సోషల్ మీడియా లో రిలీజ్ చేసి, అంచనాలను పెంచేశారు! తను ఒక చిన్న పల్లెటూరు అది కూడా రోడ్ సరిగ్గా లేని ఊరి నుంచి అంతరిక్ష శాస్త్రవేత్త కావాలని ఆశపడుతోంది… కానీ అది సాధ్యమవుతుందా అంటే సినిమా చూడాల్సిందే…
అలాగే ఈ గ్లింప్సె లో దుల్కర్ కూడా ఒక క్షణం కనబడ్డాడు… మొత్తానికి దుల్కర్ మళ్ళి ఒక కొత్త ప్రయోగం తో మెప్పించబోతున్నాడు… ఈ సినిమా ని పవన్ సాదినేని డైరెక్ట్ చేయగా,
సందీప్ గుణ్ణం నిర్మించారు… తెలుగు లో పాపులర్ బన్నెర్స్ గీత ఆర్ట్స్ ఇంకా స్వప్న సినిమా ఈ సినిమా ని ప్రెసెంట్ చేయడం కూడా స్పెషల్ ఏ… మొత్తానికి ఈ సినిమా ని పెద్ద తెర మీద చూడాలంటే సమ్మర్ వరకు ఆగాల్సిందే!