నేషనల్ క్రష్ రష్మిక మందన్నా, టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ రిలేషన్‌షిప్ లో ఉన్నారు అన్న వార్తలు గత కొన్నేళ్లుగా ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. ఇద్దరూ ప్రేమలో ఉన్నారనే కాదు… ఏకంగా ఎంగేజ్‌మెంట్ కూడా అయిపోయిందని, ఇంకా ఫిబ్రవరి లో పెళ్లి అని కూడా ప్రచారం సాగుతోంది. అయితే ఇప్పటివరకు ఈ విషయంపై రష్మిక గానీ, విజయ్ గానీ స్పష్టంగా అవునని చెప్పలేదు… కాదని ఖండించలేదు.
ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో రష్మికను ఇదే ప్రశ్న అడిగారు. దీనికి ఆమె ఇచ్చిన సమాధానం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పుకార్లపై స్పందించిన రష్మిక… “గత నాలుగేళ్లుగా ఇలాంటి రూమర్స్ వస్తూనే ఉన్నాయి. అసలు నిజం ఏంటో సరైన సమయం వచ్చినప్పుడు నేనే మాట్లాడతాను. అంతకు ముందు కాదు” అని చెప్పింది. ఎప్పటిలాగే ఆమె ఈ విషయాన్ని కన్‌ఫర్మ్ చేయకపోయినా… డినై కూడా చేయలేదు.
అయితే రష్మిక మాటల తీరులో ఓ చిన్న హింట్ మాత్రం కనిపించింది. “సరైన సమయం వచ్చినప్పుడు” అనే మాటలతో… త్వరలోనే పెళ్లి వార్త బయటకు వచ్చే అవకాశం ఉందన్న సంకేతాలను ఆమె అభిమానులు గమనిస్తున్నారు. అందుకే ఇప్పుడు ఈ కామెంట్స్ మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

రష్మిక మందన్నా – విజయ్ దేవరకొండ జంట తొలిసారి ‘గీత గోవిందం’ సినిమాలో కలిసి నటించింది. ఆ సినిమా బ్లాక్‌బస్టర్ అవ్వడంతో పాటు… వీరిద్దరి మధ్య కెమిస్ట్రీకి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఆ తర్వాత ‘డియర్ కామ్రేడ్’లో మరోసారి కలిసి నటించారు. ‘గీత గోవిందం’ విడుదలైనప్పటి నుంచే వీరిద్దరి మధ్య ప్రేమ ఉందంటూ వార్తలు మొదలయ్యాయి. కానీ అప్పట్లో ఇద్దరూ “అలాంటి విషయం ఏమీ లేదు” అంటూ క్లియర్‌గా చెప్పేశారు.

అయినా వీరిద్దరూ ఇచ్చిన చిన్న చిన్న హింట్స్, కలిసి కనిపించడం, వేకేషన్ ఫోటోలు వంటివి అభిమానుల్లో మరింత అనుమానాలకు దారి తీశాయి. ఎంగేజ్‌మెంట్ కూడా అయిపోయిందని, సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నారన్న టాక్ కూడా ఇండస్ట్రీలో వినిపిస్తోంది.
ఇక వర్క్ ఫ్రంట్ విషయానికి వస్తే… రష్మిక మందన్నా ఇటీవల ‘ది గర్ల్‌ఫ్రెండ్’ సినిమాలో కనిపించింది. ప్రస్తుతం ఆమె ‘కాక్టెయిల్ 2’, ‘మైసా’ వంటి క్రేజీ ప్రాజెక్ట్స్‌లో నటిస్తోంది. మరోవైపు విజయ్ దేవరకొండ కూడా పలు భారీ సినిమాలతో బిజీగా ఉన్నాడు.