రష్యా–ఉక్రెయిన్ యుద్ధం మరింత ఉధృతంగా మారుతున్న నేపథ్యంలో, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యా మరోసారి భారీ స్థాయిలో దాడి చేసేందుకు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకుందని, సరైన అవకాశాన్ని ఎదురుచూస్తోందని ఆయన ఆరోపించారు.
ప్రస్తుత పరిస్థితులు అత్యంత సున్నితంగా ఉన్నాయని చెబుతూ, దేశ ప్రజలు వైమానిక దాడుల హెచ్చరికలను ఏమాత్రం నిర్లక్ష్యం చేయవద్దని జెలెన్‌స్కీ హెచ్చరించారు. అలాంటి అలర్ట్స్ వచ్చిన వెంటనే అప్రమత్తంగా స్పందించాలని సూచించారు. అలాగే ప్రభుత్వంలోని అన్ని విభాగాలు, భద్రతా బలగాలు ఎప్పటికప్పుడు రెడీగా ఉండాలని ఆయన ఆదేశించారు.
ఈ నేపథ్యంలో దేశాన్ని రక్షించుకోవడానికి ఐక్యతే ప్రధాన ఆయుధమని పేర్కొన్న జెలెన్‌స్కీ, ప్రజల భద్రతే తమకు మొదటి ప్రాధాన్యమని స్పష్టం చేశారు. ఈ విషయాలను తెలియజేస్తూ ఆయన తాజాగా ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు.