మన తెలంగాణ గవర్నమెంట్ తరపున దావోస్ కి సీఎం రేవంత్ రెడ్డి తో పాటు, కొంత మంది మినిస్టర్స్ కూడా నిన్న వెళ్లారు… ఐతే అక్కడ 2026 వరల్డ్ ఎకనామిక్ ఫోరం (WEF) డావోస్ సదస్సులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంట మెగాస్టార్ చిరంజీవి కనిపించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
తెలంగాణ ప్రతినిధి బృందానికి నేతృత్వం వహిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, చిరంజీవి జ్యూరిక్‌లో కుటుంబంతో విహారయాత్రలో ఉన్నారన్న విషయం తెలుసుకొని వెంటనే ఆయనకు ఆహ్వానం పంపారు. ఆ ఆహ్వానాన్ని చిరంజీవి ఎంతో సంతోషంతో స్వీకరించడంతో ఈ సమావేశం మరింత ప్రత్యేకంగా మారింది.
తెలంగాణ రాష్ట్ర భవిష్యత్ దిశను నిర్దేశించే ‘తెలంగాణ రైజింగ్ 2047’ విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ సందర్భంగా ఇద్దరూ కలిసి వేదికపై నిలిచి, రాష్ట్ర ఆశయాలను అంతర్జాతీయ వేదికపై ప్రదర్శించారు.
ఈ భేటీ ఎంతో ఆత్మీయతతో సాగింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, ఇటీవల తన పిల్లలు, మనవడి తో కలిసి ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమాను చూశానని, సినిమా చాలా బాగుందని, కుటుంబంతో కలిసి చూడదగిన వినోదాన్ని అందించిందని చిరంజీవితో పంచుకున్నారు. సీఎం మాటలు చిరంజీవి ముఖంలో చిరునవ్వు తెచ్చాయి.
ఇక ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమా సాధిస్తున్న ఘన విజయంతో చిరంజీవి ఎంతో ఆనందంగా ఉన్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద వరుస రికార్డులు బద్దలు కొడుతూ, రెండో వారంలో కూడా అదే జోరు కొనసాగిస్తోంది.