భగవంత్ కేసరి ఇంకా చాల పెద్ద హిట్ కావాల్సింది – అనిల్ రావిపూడి

Bhagavanth Kesari Deserved Bigger Success, Says Director Anil Ravipudi

టాలీవుడ్ లో ఇప్పుడు అనిల్ రావిపూడి ఒక గ్రేట్ డైరెక్టర్… వరుసగా 9 సినిమాలు హిట్ అవ్వడం వల్ల ఆయనకి ఫుల్ డిమాండ్ ఇంకా క్రేజ్ వచ్చాయి… అలానే లేటెస్ట్ సినిమా మన శంకర వర ప్రసాద్ తో అయన పీక్ స్టేజి లోకి వెళ్లారు. ఆల్రెడీ 300 కోట్లు కలెక్ట్ చేసిన ఈ సినిమా ఇప్పుడు కొత్త రికార్డ్స్ బ్రేక్ చేయడానికి సిద్ధం గా ఉంది…

ఐతే ఈ సంక్రాంతికి అటు కోలీవుడ్ లో భగవంత్ కేసరి రీమేక్ జన నాయకన్ రిలీజ్ అవ్వాల్సి ఉండగా, కోర్ట్ కేసెస్ వల్ల అవ్వలేదు. ఆ సినిమా అనిల్ రావిపూడి దే కాబట్టి, ఈసారి ఇటు టాలీవుడ్ అటు కోలీవుడ్ లో రెండు సినిమాలు అనుకున్నాం.

కానీ జరగలేదు… ఐతే బాలయ్య తో చేసిన భగవంత్ కేసరి తనకు చాల ప్రత్యేకమైన సినిమా అని అది ఇంకా చాల బాగా హిట్ అవ్వాల్సింది కానీ అవ్వలేదు అని దానికి రీసన్ చెప్పారు…

‘‘బాలకృష్ణతో నేను ఎవరూ ఊహించనివిధంగా సినిమా చేయాలనుకున్నాను. నా కెరీర్‌లో కష్టపడి రాసుకున్న స్క్రిప్ట్‌లలో అదీ ఒకటి. కానీ, ఆ సినిమా ఇంకా హిట్‌ కావాల్సింది. అది విడుదలైనప్పుడు చంద్రబాబునాయుడు జైలులో ఉండడంతో బాలయ్య అభిమానులు చాలామంది నిరాశకు గురయ్యారు. సాధారణ ప్రేక్షకులు దాన్ని చూసి ఆదరించి హిట్‌ చేశారు. పరిస్థితులు బాగుండి ఉంటే దానికి ఇంకా ఆదరణ దక్కేది’’.

ఐతే జన నాయకన్ స్క్రిప్ట్ వర్క్ లో హెల్ప్ చేయడం వల్ల ఆ satisfaction వచ్చింది అని అన్నారు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *