జూనియర్ ఎన్టీఆర్… మన యంగ్ టైగర్ సినిమా కోసం చాల రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం కదా… దేవర సినిమా తరవాత వార్ 2 వచ్చినా అంతగా ఆడలేదు. సో ఇప్పుడు ఆశలన్నీ ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న డ్రాగన్ సినిమా పైనే. ఈ సినిమా కోసం NTR చాల సన్నగా అయ్యాడు…

ఐతే లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే, జూనియర్ NTR కి స్వల్ప అనారోగ్యం… అయన జలుబు కారణంగా ఇబ్బంది పడుతున్నాడని సమాచారం. డాక్టర్స్ కొన్ని రోజులు రెస్ట్ కావాలని చెప్పడం తో డ్రాగన్ షూటింగ్ కి బ్రేక్ పడింది. ఎన్టీఆర్ కోలుకున్న వెంటనే షూటింగ్ స్టార్ట్ అవుతుందని కూడా మేకర్స్ చెప్పారు!
అలాగే ఈ సినిమా లో బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ అనిల్ కపూర్, రుక్మిణి వసంత్ ఇంకా మలయాళ నటుడు టోవినో థామస్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నాడు!