షాహిద్ కపూర్ ఓ రోమియో ట్రైలర్ చూసారా???

Shahid Kapoor and Vishal Bharadwaj’s O’Romeo Trailer Promises a Bold Gangster Drama

షాహిద్ కపూర్ మరోసారి ప్రముఖ దర్శకుడు విశాల్ భరద్వాజ్‌తో చేతులు కలిపి చేస్తున్న కొత్త చిత్రం ‘ఓ’రోమియో… గ్యాంగ్‌స్టర్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా, ముంబై అండర్‌వర్‌ల్డ్ నేపథ్యంలో వెస్ట్రన్ టచ్‌తో స్టైలిష్‌గా రూపొందుతున్నట్లు తెలుస్తోంది. రిలీజ్ డేట్ దెగ్గర పడుతుండడం తో ఈ రోజు సినిమా యూనిట్ ట్రైలర్‌ను విడుదల లాంచ్ చేసారు…

ట్రైలర్‌ను గమనిస్తే, కథ మొత్తం ముంబైలోని క్రైమ్‌తో నిండిన వీధుల్లో సాగుతుంది. షాహిద్ కపూర్ ఇందులో భయంకరమైన గ్యాంగ్‌స్టర్‌గా, హింసాత్మక యాంటీ-హీరో పాత్రలో కనిపిస్తున్నారు. ఐతే త్రిప్తి డిమ్రీ తో సేఫ్టీ కోసం మొదలైన ఈ పరిచయం క్రమంగా అనేక మలుపులు తిరుగుతుంది… ప్రేమ ఉంది కానీ భయం కూడా ఉంటుంది!

ట్రైలర్ చూస్తే ఇది మరో పవర్‌ఫుల్, బోల్డ్ గ్యాంగ్‌స్టర్ సినిమా అని అర్థమవుతుంది. థియేటర్లలో విడుదలైన తర్వాత ఈ చిత్రం చర్చలకు దారి తీసే అవకాశం ఉందని చెప్పవచ్చు. వెస్ట్రన్ స్టైల్‌తో గ్యాంగ్‌స్టర్ జానర్‌ను కొత్తగా నిర్వచించేందుకు చేసిన ప్రయత్నంగా ‘ఓ’రోమియో కనిపిస్తోంది. సినిమా హిట్ అయితే ఈ ట్రెండ్‌కు మళ్లీ ఊపు వస్తుంది… కాకపోతే విమర్శలకు కూడా తావిస్తుంది.

ఈ చిత్రంలో అవినాష్ తివారి ప్రధాన విలన్‌గా కనిపించనుండగా, దిశా పటానీ ఒక స్పెషల్ డాన్స్ సాంగ్‌లో ఆకట్టుకునేలా కనిపిస్తుంది. నానా పటేకర్ కీలక పాత్రలో నటిస్తుండగా, విక్రాంత్ మాస్సే మరో ప్రత్యేక పాత్రలో సందడి చేయనున్నారు.

సాజిద్ నడియాడ్‌వాలా నిర్మిస్తున్న ఈ చిత్రం, నడియాడ్‌వాలా గ్రాండ్‌సన్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రూపొందుతోంది. 2026 ఫిబ్రవరి 13న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *