చిరంజీవి మన శంకర వర ప్రసాద్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో మనకి తెలిసిందే కదా… కేవలం 10 రోజుల్లోనే ఈ సినిమా 300 కోట్లు కాలేచ్ట్ చేసి అందరిని ఆశ్చర్య పరచింది. అలాగే చిరు కెరీర్ లో కూడా ఈ సినిమా హైయెస్ట్ grosser గా నిలిచింది!
ఇక ఈ సినిమా కి చిరంజీవి కూతురు సుస్మిత సహా నిర్మాత కాబట్టి, మెగాస్టార్ కి ఇది డబల్ ఆనందం కదా… ఐతే ఈ సినిమా లో వెంకటేష్ కూడా ఒక చిన్న రోల్ చేసి అందరిని నవ్వించాడు లాస్ట్ లో.
ఐతే ఈ సినిమా లో వెంకటేష్ కి ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చారు అన్న ప్రశ్న అందరి లో ఉంది… దీనికి తన రీసెంట్ ఇంటర్వ్యూ లో ప్రొడ్యూసర్ సుష్మిత చక్కని సమాధానం చెప్పింది… “వెంకటేశ్ రెమ్యునరేషన్ విషయంలో డిబేట్ ఏం జరగలేదు. ఈ సినిమాకు ఆయన పాత్ర ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆయన స్క్రీన్‌పై కనిపించిన దగ్గర నుంచి ప్రేక్షకులు ఎక్కువ కనెక్ట్ అయ్యారు. ఆయన తీసుకున్న రెమ్యునరేషన్‌కు పూర్తి న్యాయం చేశారు. ఆయనకు ఎంత ఇవ్వాలన్నా మాకు ఆనందమే. వ్యక్తిగతంగానూ ఆయన చాలా పాజిటివ్‌గా ఉంటారు. చిరంజీవి, వెంకటేశ్ ఉంటే ఆరోజు సెట్ అంతా నవ్వులతో నిండిపోయేది. వెండితెరపై వాళ్లిద్దరూ హిట్ కాంబినేషన్‌గా మారారు’’ అని సుస్మిత అన్నారు.
సో, ఒకవేళ కథ కుదిరితే చిరు వెంకీ మళ్ళి కలిసి నటిస్తారన్నమాట…