బిలియనీర్ అనంత్ అంబానీకి లగ్జరీ వాచ్‌లు సేకరించడం ఒక ప్రత్యేకమైన habit గా మారింది. ఇప్పటికే ఆయన కలెక్షన్‌లో కోట్ల రూపాయల విలువైన ఎన్నో అరుదైన వాచ్‌లు ఉండగా, తాజాగా ఆ లిస్టులోకి మరో అద్భుతమైన వాచ్ చేరింది. దాని ధర వింటే ఎవరికైనా ఆశ్చర్యమే… ఏకంగా రూ.13.7 కోట్లు.
ప్రఖ్యాత లగ్జరీ బ్రాండ్ ‘జాకబ్ అండ్ కో’ రూపొందించిన ఈ ప్రత్యేక వాచ్ పేరు ‘వనతార’. గుజరాత్‌లో అనంత్ అంబానీ స్థాపించిన వన్యప్రాణి సంరక్షణ కేంద్రం థీమ్‌ను ప్రతిబింబించేలా ఈ వాచ్‌ను డిజైన్ చేశారు. ఈ వాచ్ డయల్ మధ్యభాగంలో అనంత్ అంబానీ చిన్న రూపంతో పాటు, సింహం ఇంకా బెంగాల్ టైగర్ బొమ్మలు ఎంతో కళాత్మకంగా చెక్కబడ్డాయి.

ఈ వాచ్ ప్రత్యేకత కేవలం డిజైన్‌లోనే కాదు… దానిలో వాడిన విలువైన రత్నాల్లోనూ ఉంది. మొత్తం 21.98 క్యారెట్ల బంగారం, అలాగే 397 అరుదైన డైమండ్స్ ఈ వాచ్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చాయి. వన్యప్రాణుల సంరక్షణపై తనకున్న ప్రేమను, లగ్జరీపై ఉన్న ఆసక్తిని ఒకేసారి చూపించేలా ఈ వాచ్‌ను అనంత్ అంబానీ ప్రత్యేకంగా తయారు చేయించుకున్నట్లు సమాచారం.
మొత్తానికి, వనతార థీమ్‌తో రూపొందిన ఈ జాకబ్ అండ్ కో వాచ్, అనంత్ అంబానీ లగ్జరీ కలెక్షన్‌లో మరో ఖరీదైన రత్నంగా నిలిచింది.