రామ్ చరణ్ ‘పెద్ది’ పోస్టుపోన్ అవుతుందా???

Ram Charan’s Peddi Update: AR Rahman Starts BGM, Second Single Release Planned

రామ్ చరణ్ ప్రస్తుతం తన రాబోయే చిత్రం ‘పెద్ది’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్న ఈ గ్రామీణ నేపథ్య స్పోర్ట్స్ డ్రామా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే బుచ్చిబాబు సినిమా ఫస్ట్ హాఫ్ ఫైనల్ కట్‌ను లాక్ చేసి, మ్యూజిక్ కంపోజర్ ఏఆర్ రెహ్మాన్ కు పంపించారు. రెహ్మాన్ త్వరలోనే ఈ సినిమాకు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పనులు ప్రారంభించనున్నారు. ఇంకా సమయం ఉండటంతో, ఈ చిత్రానికి రెహ్మాన్ తన బెస్ట్ వర్క్ అందిస్తారని టీమ్ నమ్మకంగా ఉంది.

ఇప్పటికే విడుదలైన తొలి సింగిల్ ‘చికిరి చికిరి’ చార్ట్‌బస్టర్‌గా నిలవడంతో, ఫిబ్రవరిలో రెండో సింగిల్ విడుదల చేయాలని ‘పెద్ది’ టీమ్ ప్లాన్ చేస్తోంది. సాంగ్ లాంచ్ డేట్ ని త్వరలోనే ఖరారు చేసి ప్రకటించనున్నారు. ఈ సినిమాలో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా, రామ్ చరణ్ ఓ స్పోర్ట్స్ అథ్లెట్ పాత్రలో కనిపించనున్నారు.

‘పెద్ది’ సినిమాను అన్ని భారతీయ భాషల్లో మార్చి 27, 2026న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే సినిమా విడుదల మే నెలకు వాయిదా పడే అవకాశముందని వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై త్వరలో స్పష్టత రానుంది. ప్రస్తుతానికి మాత్రం, మార్చి 27 విడుదల తేదీనే అధికారికంగా కొనసాగుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *