మంచు మనోజ్… తన కం బ్యాక్ ఎంత స్ట్రాంగ్ గా ఉందొ మన అందరం చూసాం… భైరవం సినిమాలో విలన్ గా చేసి సూపర్ అనిపించాడు. ఆ తరవాత రిలీజ్ ఐన మిరై సినిమాలో కూడా విలన్ ఏ కానీ బ్లాక్ స్వోర్డ్ గా సూపర్ గా కనిపించి, అసలు విలన్స్ ఇంత క్రూరంగా ఉంటారా అని అనిపించాడు!
ఇక నెక్స్ట్ సినెమలి లైన్ గా ప్లాన్ చేసుకుని, ప్రస్తుతానికి బిజీ గా ఉన్నాడు… అయన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ లో డేవిడ్ రెడ్డి సినిమా మోస్ట్ అవైటెడ్ డి… ఇందాకే ఆ సినిమా నుంచి ప్రీ-లుక్ పోస్టర్ రిలీజ్ చేసి వావ్ అనిపించాడు…
‘మిరాయ్’ సినిమాలో నెగటివ్ పాత్రతో మెప్పించిన మంచు మనోజ్, ఇప్పుడు ‘డేవిడ్ రెడ్డి’ సినిమాతో మరోసారి హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఐతే ఇంతకూ ముందు డేవిడ్ రెడ్డి బైక్ ని రెవీల్ చేసి, సూపర్ అనిపించారు. ఆ బైక్ చాల పోష్ గా ఫుల్లీ కస్టమైజ్డ్ గా డేవిడ్ రెడ్డి కోసం చేసారు. ఇక ఇందాకే ప్రీ లుక్ పోస్టర్ రిలీజ్ చేసి రక్తం తో తడిసిన ఎర్ర గుడ్డ లోంచి డేవిడ్ రెడ్డి కళ్ళు మాత్రమే రెవీల్ చేసారు! BRUTAL ERA BEGINS అనే కాప్షన్ కూడా సూపర్ గా ఉంది… ఫస్ట్ లుక్ పోస్టర్ రిపబ్లిక్ డే సందర్బంగా 26th న రెవీల్ చేస్తారు అని కూడా ప్రకటించారు!
ఇక అంతకు ముందు డేవిడ్ రెడ్డి సినిమా గురించి మనోజ్ చెప్తూ, “1897 నుంచి 1922 మధ్యకాలంలో సాగే పీరియడ్ డ్రామా అని వెల్లడించారు. ఇది స్వాతంత్ర్యానికి ముందు కాలంలో జరిగే కథ. అప్పటి పరిస్థితులు, అణచివేత, పోరాటాల నేపథ్యంలో ఈ కథ సాగుతుంది” అని తెలిపారు.
ఈ చిత్రంలో డేవిడ్ రెడ్డి పాత్ర ‘వార్ డాగ్’ అనే బైక్‌పై తిరుగుతాడు. అలాగే అతని చేతిలో ఉండే కర్ర పేరు ‘డెత్ నోట్’. అదే అతని ప్రధాన ఆయుధం. తన పాత్ర గురించి వివరిస్తూ మనోజ్ మాట్లాడుతూ, “డేవిడ్ రెడ్డి కేవలం బ్రిటిష్‌లకు మాత్రమే కాదు… భారతీయుల్లోని దోపిడీ శక్తులకు కూడా శత్రువే. స్వేచ్ఛ అనేది అడిగి పొందేది కాదు, పోరాడి సాధించాల్సిందే అని అతను నమ్ముతాడు. బ్రిటిష్‌లు గ్రామాలను తగలబెడితే… ఆ హింసకు మరింత హింసతోనే సమాధానం చెప్పే యోధుడిగా డేవిడ్ రెడ్డి ఎదుగుతాడు” అని చెప్పారు.