సంక్రాంతికి మీరు ఈ సినిమా చూసారు అని ఎవరినైనా అడిగితె టక్కున వచ్చే సమాధానం ‘మన శంకర వర ప్రసాద్’. ఈ సినిమా మరి అంత హిట్ అయ్యింది మరి! మెగాస్టార్ ని ఒక వింటేజ్ లుక్ లో చూపించి, నయనతార ని శశిరేఖ గా చూపించి, వెంకటేష్ ని వెంకీ గౌడ గా మార్చేసి, ఈ సినిమా అందరిని ఎంటర్టైన్ చేసింది.
ఇప్పటికే ఈ సినిమా 300 కోట్ల కలెక్షన్ ని దాటేసింది… ఐతే సోమవారం నుంచి సాధారణ హోల్డ్‌తో ముందుకెళ్లిన ఈ సినిమా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో ప్రాంతీయ సినిమాల మధ్య ఎన్నో రికార్డులను బద్దలుకొట్టి పక్కా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.
రిలీజ్ అయినప్పటి నుంచి పది రోజులు పూర్తి చేసుకున్న ఈ సినిమా, గురువారం నుంచి మళ్లీ సాధారణ టికెట్ ధరలకు వచ్చింది. ధరలు తగ్గడంతో తెలుగు రాష్ట్రాల ప్రధాన ప్రాంతాల్లో థియేటర్లకు ప్రేక్షకులు మళ్లీ బాగానే వస్తున్నారు. రెగ్యులర్ ప్రైసింగ్తో ఇప్పుడు సినిమా మరో మంచి వీకెండ్‌తో పాటు, సోమవారం వచ్చే రిపబ్లిక్ డే సెలవును క్యాష్ చేసుకునే లక్ష్యంతో ఉంది.
అయితే సోమవారం నుంచే టికెట్ ధరలను సాధారణంగా పెట్టి ఉంటే, బీ & సీ సెంటర్లలో కలెక్షన్లు ఇంకా బాగా ఉండేవని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. వీక్‌డేస్‌లో కొంత డ్రాప్ కనిపించినా, సినిమా ఇప్పటికే సంక్రాంతి విన్నర్ ట్యాగ్‌ను సొంతం చేసుకుని, ఈ ఏడాది వచ్చిన తొలి పెద్ద హిట్‌గా నిలిచింది.
ముందున్న లాంగ్ వీకెండ్‌తో ఇప్పుడు అందరి దృష్టి బాక్సాఫీస్ నడకపైనే ఉంది. ఈ అవకాశం సినిమాకు మరింత ఊపు ఇచ్చి, ప్రతిష్టాత్మకమైన ₹400 కోట్ల మార్క్ వైపు తీసుకెళ్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది.