క్రీడల్లోనూ మహిళల ‘ధాకడ్’ జోరు -మైదానంలో మెరిసిన చిన్న శీను సోల్చ‌ర్ అధినేత్రి

Women’s ‘Dhakad’ Power Shines in Sports Chinna Srinu Soldiers President Siramma Inspires at Vizianagaram Cricket Tournament

“ఆడది అబల కాదు.. మైదానంలో దిగితే తిరుగులేని సబల” అని నేటి మహిళలు నిరూపిస్తున్నారు. విజ‌య‌న‌గ‌రం లో శ‌నివారం కోరుకొండలోని వైజాగ్ ఇంటర్నేషనల్ గ్రౌండ్‌లో జేఐటిఓ లేడీస్ వింగ్ నిర్వహించిన ‘ధాకడ్ కొరియన్ క్రికెట్ టోర్నమెంట్’ సందడి నెలకొంది. ఈ వేడుకకు ముఖ్యఅతిథిగా ఉమ్మడి విజయనగరం జిల్లా చైర్మన్, వైఎస్ఆర్సిపి జిల్లా అధ్యక్షుడు, భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) కుమార్తె, చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు సిరమ్మ హాజరయ్యారు.
శ్రీచరణిని స్ఫూర్తిగా తీసుకోవాలి..!

ఈ సందర్భంగా చిన్న సోల్జ‌ర్స్ అధినేత్రి సిరి స‌హ‌స్ర మాట్లాడుతూ క్రీడాకారిణుల్లో నూతనోత్సాహాన్ని నింపారు. ఆమె ప్రసంగంలోని మాట్లాడిన‌ ముఖ్యాంశాలు:
మహిళా శక్తి: ఆధునిక ప్రపంచంలో మహిళలు అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారని, ముఖ్యంగా క్రీడారంగంలో యువకులకు ధీటుగా అగ్రస్థానంలో నిలవడం గర్వకారణమని పేర్కొన్నారు.
ప్రపంచకప్ విజయం: ఇటీవల జరిగిన విమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ 2025లో భారత జట్టు ఛాంపియన్‌గా నిలవడం యావత్ మహిళా క్రీడాకారులకు ఆదర్శమన్నారు.
రాష్ట్ర గర్వం శ్రీచరణి: మన రాష్ట్రానికి చెందిన శ్రీచరణి అద్భుతమైన బ్యాటింగ్, బౌలింగ్ ప్రతిభతో జట్టును ప్రపంచకప్ విజయం వైపు నడిపించిందని గుర్తు చేశారు. నేటి యువత ఆమెను స్ఫూర్తిగా తీసుకుని క్రీడల వైపు ఆసక్తి చూపడం శుభపరిణామన్నారు.
ఉత్సాహంగా సాగిన టోర్నీ
మహిళలు ఏ రంగంలోనూ తక్కువ కాదని నిరూపించడానికి ఇటువంటి టోర్నమెంట్లు వేదికలుగా నిలుస్తాయని సిరమ్మ పేర్కొన్నారు. క్రీడాకారులు ఉత్సాహంగా, క్రీడా స్ఫూర్తితో రాణించాలని ఆకాంక్షిస్తూ అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందు నిర్వాహకులు సిరమ్మను మెమెంటోతో సత్కరించారు.
ఈ కార్యక్రమంలో చిన్న శ్రీను సోల్జర్స్ ఉపాధ్యక్షులు తోట వాసు, చిన్న శ్రీను సోల్జర్స్ సభ్యులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *