నిఖిల్ స్వయంభు సమ్మర్ కి వాయిదా…

Nikhil’s Swayambhu Postponed to April 10 | Pan-India Epic Targets Summer Release

నిఖిల్ నటిస్తున్న భారీ పాన్-ఇండియా చిత్రం స్వయంభు ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ ప్రస్తుతం దశలో ఉంది. ఈ సినిమా షూటింగ్ మొత్తం ఇప్పటికే పూర్తవగా, మేకర్స్ ఇప్పుడు వీఎఫ్ఎక్స్ ఇంకా పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్స్ లో బిజీ గా ఉన్నారు. ఫస్ట్ మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 13న ఈ సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేశారు. కానీ ఇప్పుడు ఆ ప్లాన్ మార్చి, వేసవి సీజన్‌లో ఏప్రిల్ 10న థియేటర్లలోకి తీసుకురావాలని నిర్ణయించారు.

భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్‌పై భువన్, శ్రీకర్ నిర్మిస్తుండగా, స్వయంభులో భారీ స్థాయిలో సీజీఐ, వీఎఫ్ఎక్స్ పనులు ఉండటంతో, దేశంలోని ప్రముఖ వీఎఫ్ఎక్స్ స్టూడియోలకు పోస్ట్ ప్రొడక్షన్ బాధ్యతలు అప్పగించారు.

త్వరగా రిలీజ్ చేయాలనే ఆలోచనతో పూర్ విజువల్స్‌తో ప్రేక్షకుల ముందుకు రావడం కంటే, సరైన సమయం తీసుకుని క్వాలిటీ అవుట్‌పుట్ ఇవ్వడమే మంచిదని మేకర్స్ భావించారు. అందుకే రిలీజ్‌ను వాయిదా వేసి, పోస్ట్ ప్రొడక్షన్‌కు తగినంత టైమ్ ఇవ్వాలని నిర్ణయించారు.

అంతేకాదు, భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన పాన్-ఇండియా సినిమాలకు సమ్మర్ సీజన్ అనుకూలంగా ఉంటుందనే అభిప్రాయం కూడా ఈ నిర్ణయానికి కారణంగా నిలిచింది. ఈ విషయంపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

ఈ సినిమాలో నిఖిల్ ఓ లెజెండరీ వారియర్ పాత్రలో కనిపించనున్నారు. ఆయనకు జోడీగా సమ్యుక్త, నభా నటేష్ నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన రైజ్ ఆఫ్ స్వయంభు వీడియో సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేయగా, ప్రేక్షకుల్లో అంచనాలు మరింత పెరిగాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *