దుల్కర్ సల్మాన్ ‘ఆకాశం లో ఒక తార’ నుంచి శృతి హాసన్ బోల్డ్ లుక్…

Shruti Haasan First Look From Dulquer Salmaan’s Aakasamlo Oka Tara Unveiled

దుల్కర్ సల్మాన్ హీరోగా తెరకెక్కుతున్న అప్‌కమింగ్ ఎంటర్టైనర్ ‘ఆకాశంలో ఒక తార’ సినిమాపై అంచనాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. పవన్ సాదినేని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం సమ్మర్‌లో థియేటర్లలోకి రావడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్, గ్లింప్స్, టీజర్ విడుదలై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని కలిగించాయి. తాజాగా ఈ చిత్రంలోని మరో కీలక పాత్రను మేకర్స్ పరిచయం చేశారు.

నటి శ్రుతి హాసన్ పుట్టినరోజు సందర్భంగా ఆమె క్యారెక్టర్‌కు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో శ్రుతి హాసన్ చాలా ఇంటెన్స్‌గా, కనిపిస్తుంది. చేతిలో సిగరెట్‌తో తన పనిలో లీనమై ఉన్న ఆమె లుక్ సినిమా కథలో ఆమె పాత్ర ఎంత బలంగా ఉండబోతుందో చెప్పకనే చెబుతోంది.

ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా సమర్పణలో సందీప్ గుణ్ణం, రమ్య గుణ్ణం నిర్మిస్తున్నారు. హీరోయిన్‌గా సత్విక వీరవల్లి నటిస్తోంది. మొత్తానికి శ్రుతి హాసన్ ఫస్ట్ లుక్ విడుదలతో ఈ సినిమాపై బజ్ మరింత పెరిగింది. సమ్మర్ రిలీజ్‌గా ప్లాన్ చేస్తున్న ఈ చిత్రం దుల్కర్ సల్మాన్ కెరీర్‌లో మరో ప్రత్యేక చిత్రంగా నిలుస్తుందా అనే ఆసక్తి ఇప్పుడు అందరిలోనూ నెలకొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *