27/06/2026
Vijay actor

ప్రముఖ నటుడు, టీవీకే పార్టీ అధినేత విజయ్‌పై ఎన్నికల నియమావళి ఉల్లంఘించినట్టుగా ఎన్నికల సంఘం కేసు నమోదు చేసింది. ప్లయింగ్ స్క్వాడ్ అధికారి కుమార్ ఫిర్యాదు అందించిన తర్వాత, పెరవల్లూర్ పోలీస్ స్టేషన్‌లో ఈ కేసు నమోదయ్యింది. పెరవల్లూర్ పోలీసులు బీఎన్ఎస్ 2023, సెక్షన్ 126(2), 189(2), 223, 3(ఏ) మరియు 3(5) కింద చర్యలు చేపట్టారు.


తమిళనాడులో వచ్చే నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, విజయ్ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేస్తూ పర్యటన చేస్తున్నారు. ఇటీవల జరిగిన బహిరంగ సభలో నిబంధనలు ఉల్లంఘించబడ్డాయని ఎన్నికల సంఘం ఆరోపించింది .. ప్రభుత్వ అనుమతి లేకుండా 30 లౌడ్‌స్పీకర్లు వాడగా, 5,000 కంటే ఎక్కువ మంది ప్రజలు సభకు హాజరయ్యారు. ఇది స్థానికులకి అసౌకర్యాన్ని కలిగించిందని ఈసీ ఫిర్యాదు చేసింది.

అలాగే, రోడ్లను బ్లాక్ చేయడం, అత్యవసర వాహనాలకు మార్గం ఇవ్వకపోవడం, ప్రజల భద్రతపై దృష్టి పెట్టకపోవడం వంటి అంశాలను కూడా ఫిర్యాదు లో చేర్చారు. ఫలితంగా, విజయ్‌పై అనేక సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. సభలో పాల్గొన్న పార్టీ కార్యకర్తల్ని కూడా ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు.

Also Read  Politicians and diapers must be changed often, and for the same reason

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *