23/06/2026
TVK Victory: How Vijay Rewrote Tamil Nadu Political History in Just 2 Years

TVK Victory: How Vijay Rewrote Tamil Nadu Political History in Just 2 Years

మనం నార్మల్ గా తమిళ్ నాడు పొలిటికల్ హిస్టరీ చుస్తే సినిమా యాక్టర్స్ కి వారు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో తెలుసు కదా. అలా అంటే మన తెలుగు నేల పై కూడా NTR వచ్చారు… CM అయ్యారు… నెక్స్ట్ బాలకృష్ణ… ఇప్పుడు పవన్ కళ్యాణ్… అలానే చాల మంది హీరోస్ కూడా పొలిటికల్ గా రాణించారు… కానీ తమిళ్ నాడు లో యాక్టర్స్ ని విపరీతంగా అభిమానిస్తారు… MJR నుంచి, జయలలిత, కమల్ హాసన్, విజయకాంత్…ఇలా చాల మంది ఉన్నారు. కానీ ఇప్పుడు విజయ్ కి వచ్చిన విజయం అసాధారమైనది… పైన చెప్పిన వారందరు పెద్ద గా పోటీ లేదు అని చెప్పం కానీ… ఒకటో రెండో పార్టీస్ rival గా ఉండేవి… కానీ విజయ్ కి రెండు పెద్ద పార్టీస్ దశాబ్దాలుగా ఉన్న DMK ఇంకా AIADMK పోటీ ఉన్నాయ్… అలాగే కాంగ్రెస్ కూడా ఉంది… ఇంకా చాల చిన్న చిన్న పార్టీస్…

అసలు పార్టీ పెట్టిన రెండు ఏళ్లలో ఇది ఎలా సాధ్యమయ్యింది అంటే… అయన చరిష్మా ఒక్కటే కాదు… ప్రజల కష్టాలు తీరుస్తాడు అన్న భరోసా… ఎస్… మనం నార్మల్ గా రీల్స్ లో చూసినట్టు DMK అధినేత స్టాలిన్ chocolates విసరడం చూసాం… కానీ విజయ్ అదే పిల్లలని ఎత్తుకున్నాడు… ఇది చాలదా… ఒక చిన్న డిఫరెన్స్ కనిపిస్తుంది అనుకున్నాం కానీ అది చాల పెద్ద తేడా చేసింది… ప్రజలకి అహంకారం కాదు… నేను మీ వాడిని అనే భరోసా కావాలి…

అలాగే TVK కి అతి పెద్ద face గా విజయ్ కనిపించచ్చు… కానీ ప్రశాంత్ కిషోర్… ‘నామ్ తో సున హోగా’… KGF డైలాగ్ గుర్తుందా??? ఎస్… ఆయనే ఐప్యాక్ ని సృష్టించి… ఓహో పొలిటికల్ పార్టీస్ వెనుక నిలబడి ఇలా గెలిపించచ్చా అని అనుకునేలా చేసిన మనిషే ప్రశాంత్ కిషోర్… TVK వెనకుండి… విజయ్ బుజం తట్టి నడిపించాడు… ఎస్… అయన వ్యూహాలు తెలుసు కదా… అందుకే DMK అది కూడా అధికార పార్టీ ఏమి చేయలేక పోయింది! ఇక AIADMK ఐతే జయలలిత వెళ్ళిపోయినప్పుడే ఆ పార్టీ పని అయిపోయింది… మరో సారి అది ప్రూవ్ అయ్యింది.

ఐతే ఇప్పుడు మన ముందు ఉన్న question … విజయ్ కి ఇంకో పది సీట్స్ ఎవరు ఇస్తారు… TVK పార్టీ కాంగ్రెస్ ని అప్రోచ్ అయ్యింది అని నిన్ననే తెలుసు కదా. ఐతే కాంగ్రెస్ కూడా సపోర్ట్ ఇచ్చి ఐదు సీట్ల ప్రాబ్లెమ్ తీర్చింది… ఇక నెక్స్ట్ CPI CPM పార్టీలు కూడా మద్దతు ఇస్తాయి అంటున్నారు… కానీ ఇవన్నీ చిన్న పార్టీస్ తమిళ్ నాడు రాజకీయాల్లో… ఎప్పుడు ఎం జరిగిన వెనక్కి వెళ్లచ్చు… అలా ఐతే మిగిలింది AIADMK ఇంకా DMK …

Also Read  జిల్లా పోలీస్ కార్యాలయం ముందు గర్భిణి కన్నీళ్లు.. వేధింపులపై రక్షణ కోరిన అనురాధ

AIADMK గురించి తరవాత మాట్లాడదాం… ఫస్ట్ DMK ఐతే మద్దతు ఇవ్వదు! స్టాలిన్ గురించి తెలుసు కదా… ఓటమిని ఒప్పుకుని మల్లి గట్టిగా పుంజుకుంటాం అని చెప్పాడు. కరుణానిధి తరవాత అయన పార్టీ కి పెద్ద దిక్కు అయ్యి… పార్టీ ని నడిపిస్తున్నాడు. అలానే తమిళ్ నాడు లో సినిమా స్టార్స్ కి ఉన్న value తెలుసు కాబట్టి, తన కొడుకు ఉదయ నిధి ని సినిమాల్లో మరింత రాణించేలా చేసి, డిప్యూటీ సీఎం చేసాడు… మరి సినిమా స్టార్స్ మద్దతు కూడా కావాలి కదా… ఐతే TVK లేకపోతె, ఈజీ గా ఈసారి కూడా సినిమా స్టార్స్ మద్దతు ఉండేదేమో కదా… ఎక్కడైనా పరిచయాలే ముఖ్యం కదా. ఉదయనిధి సినిమా స్టార్… సో, ఎవరైనా తెలిసిన వారికే వోట్ వేస్తారు అని అనుకోవచ్చు.

కానీ విజయ్ వచ్చాక పరిస్థితి మారింది… విజయ్ ఉదయనిధి కంటే చాల పెద్ద స్టార్… అందుకే సినిమా స్టార్స్ కూడా విజయ్ గెలిచాక సంబరాలు చేసుకున్నారు… పెద్ద పెద్ద హీరోలు, చిన్న స్టార్స్ ఇంకా చాల మంది whistle కి తమ మద్దతు తెలిపి, గెలిచాక ట్విట్టర్ లో కంగ్రాట్స్ చెప్పారు. సో, స్టాలిన్ ఫార్ములా ఇక్కడ కొంచం ఫెయిల్ అయ్యింది.

నెక్స్ట్ AIADMK గురించి మాట్లాడితే… జయలలిత ని చంపారా, ఆవిడే అనారోగ్యం తో చనిపోయారా అనే విషయం పక్కనపెడితే, ఆ పార్టీ లో చాల చాల జరిగాయి. జయలలిత మరణం తరువాత శశికళ ఎంటర్ అయ్యింది… కానీ పార్టీ రెండు ముక్కలు కూడా అయ్యింది. ఇక ఎం జరుగుతుంది??? ప్రజలు అమాయకులు కాదు… అమ్మ మీద ఉన్న నమ్మకం చినమ్మ సృష్టించుకోలేకపోయింది. ఇక పన్నీర్ సెల్వం CM అయినా కానీ తరవాత మల్లి పాణాళిస్వామి CM అయ్యారు. నెక్స్ట్ ఎలెక్షన్స్ లో ఈ ఇద్దరి మధ్య పోటీ నడిచి, పార్టీ చీలింది, DMK గెలిచింది. కానీ ఇప్పుడు కూడా పన్నీర్ సెల్వం DMK లో జాయిన్ అయ్యి, ఇంకా AIADMK ని వీక్ చేసాడు. ఇప్పుడు AIADMK ఉన్న కొద్దీ సింపతీ కూడా గంగపాలు అయ్యేటట్టు ఉంది…

ఇప్పుడు ప్రెసెంట్ సిట్యుయేషన్ లో AIADMK లో ని సగం మంది MLA లు TVK లో చేరతారంట… అసలు విజయ్ నాతో ఎవరు కలుస్తారు అని చూస్తుంటే, వీళ్లు AIADMK ని TVK లో విలీనం చేసేలా ఉన్నారు… ఎందుకు అంటే ఏకంగా పళనిస్వామి ఏ TVK లోకి వెళ్తారంటా. ఇందాకే TVK లీడర్ తో కూడా మాట్లాడారు అని వార్తలు వస్తున్నాయి. అంటే అర్ధం అయ్యిందా ఇక్కడ సిట్యుయేషన్…

Also Read  తీర ప్రాంత అడవుల రక్షణ… ఆక్రమణల నిరోధంపై దృష్టి - డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

రేపు విజయ్ ప్రమాణస్వీకారం… సో, తమిళ్ నాడు రాజకీయాలు, విజయ్ రాకతో పూర్తిగా మారాయి… రేపు అసలు AIADMK ఉంటుందా??? ఆ పార్టీ కి మిగిలిన లీడర్స్ ఎవరు అని తెలుస్తుంది. ఇక్కడ విజయ్ ట్విట్టర్ లో రాహుల్ గాంధీ కి మోడీ గారికి రిప్లై ఇచ్చారు… అంటే రెండు పార్టీస్ తో వైరం వద్దు! అసలు డ్రామా ముందుందీ గురు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *