Today Horoscope June 13, 2026
మేషరాశి
ఈ రోజు మీ ఆత్మవిశ్వాసాన్ని పరీక్షించే పరిస్థితులు ఎదురవచ్చు. కుటుంబ వ్యవహారాల్లో చిన్నపాటి కలతలు చెలరేగే అవకాశం ఉంది. సంయమనం పాటించాలి. ఉద్యోగస్తులకు ఉద్దేశించని పనిభారంతో ఒత్తిడి ఉండొచ్చు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. వీలైనంత వరకు ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించాలి.
పరిహారం: సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి.
శుభ సమయం: ఉదయం 10:30 నుంచి 12:00 వరకు
వృషభరాశి
ఆర్థికంగా ఈరోజు బాగుంటుంది. వాహనాలు నడిపే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. స్నేహితుల సహకారం లభిస్తుంది. అయితే, వారి నుంచి వచ్చే కొన్ని మాటల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నూతన వ్యాపార ప్రయత్నాలు ఫలిస్తాయి.
పరిహారం: నెయ్యితో దీపం వెలిగించండి.
శుభ సమయం: సాయంత్రం 5:30 నుంచి 7:00 వరకు
మిథునరాశి
కీలక నిర్ణయాలు తీసుకోవడానికి ఇది అనుకూలమైన రోజు. సాంకేతిక రంగంలోని వారికి ప్రోత్సాహకాలు లభిస్తాయి. ఉద్యోగంలో రాణిస్తారు. ప్రేమ సంబంధిత వ్యవహారాల్లో స్పష్టత వస్తుంది. కుటుంబ సభ్యులతో సమయాన్ని గడుపుతారు.
పరిహారం: విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.
శుభ సమయం: మధ్యాహ్నం 2:00 నుంచి 3:30 వరకు
కర్కాటకరాశి
ఈరోజు మీరు ఊహించిన విధంగా పరిస్థితులు ఉండకపోవచ్చు. అసహనాన్ని, ఉద్వేగాన్ని నియంత్రించుకోవాలి. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగం విషయంలో నిర్ణయాలను వాయిదా వేసుకోవడం మంచిది.
పరిహారం: చంద్రమండల ఆరాధన చేయండి.
శుభ సమయం: ఉదయం 9:00 నుంచి 10:30 వరకు
సింహరాశి
ఈరోజు మీరు చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. విద్యార్థులకు మంచి అవకాశాలు ఉన్నాయి. తల్లిదండ్రుల ఆశీస్సులతో గొప్ప విజయాలు సాధిస్తారు. సామాజికంగా మీకు ప్రాధాన్యత పెరుగుతుంది. కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి.
పరిహారం: సూర్యనమస్కారాలు చేయండి.
శుభ సమయం: ఉదయం 6:00 నుంచి 7:30 వరకు
కన్యారాశి
ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంది. మీ మాటల పలువురిపై ప్రభావం చూపుతాయి. నూతన పనులు చేపట్టేందుకు ఇది అనుకూలమైన సమయం. ఆర్థికంగా లాభాలుంటాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది.
పరిహారం: లక్ష్మీదేవిని పాలాభిషేకం చేయండి.
శుభ సమయం: రాత్రి 7:00 నుంచి 8:30 వరకు
Also Read:జూన్ 12 రాశిఫలాలుః సర్వార్ధసిద్దియోగంతో ఈ రాశులకు అదృష్టం
తులారాశి
ఈరోజు ఈరాశివారికి ఫలితాలు మధ్యస్థంగా ఉన్నాయి. మీ చుట్టూ శతృవులు ఉన్నారు జాగ్రత్తగా ఉండాలి. ఏ నిర్ణయం తీసుకున్నా సంపూర్ణంగా విశ్లేషించి ముందుకు అడుగులు వేయాలి. ఖర్చుల విషయంలో ఒకటికి నాలుగుసార్లు ఆలోచించాలి. ఆధ్యాత్మికత వైపు అడుగులు వేస్తారు.
పరిహారం: దుర్గాదేవిని ధ్యానించండి.
శుభ సమయం: మధ్యాహ్నం 12:00 నుంచి 1:30 వరకు
వృశ్చికరాశి
ఈరోజు ఈరాశివారికి ఫలితాలు కొంత అనుకూలంగా ఉన్నాయి. ఇంట్లో శుభకార్యాలను నిర్వహిస్తారు. సన్నిహితుల నుంచి శుభవార్తలు వింటారు. ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
పరిహారం: హనుమాన్ చాలీసా పఠించండి.
శుభ సమయం: ఉదయం 8:00 నుంచి 9:30 వరకు
ధనుస్సురాశి
ఈరోజు ఈరాశివారికి ఫలితాలు కొంత అనుకూలంగా ఉన్నాయి. ఒకేసారి పలురకాలైన పనులు చేసేందుకు ప్రయత్నిస్తారు. అయితే, ఈ కారణంగా శరీరం అలసిపోయే అవకాశం ఉంది. నూతన వ్యక్తుల పరిచయాలు లాభిస్తాయి. శతృవులపై పైచేయి సాధిస్తారు. మాట విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
పరిహారం: గురువార వ్రతం పాటించండి.
శుభ సమయం: సాయంత్రం 4:00 నుంచి 5:30 వరకు
మకరరాశి
పారితోషికాల విషయంలో కొంత నిరుత్సాహం తలెత్తొచ్చు. శ్రమతో విజయాలు సాధించగలుగుతారు. కుటుంబంలో చిన్న వివాదాలు సంభవించవచ్చు. ధైర్యంగా, నిశ్చలంగా ఉండటం మంచిది.
పరిహారం: శనిదేవుని ఆరాధించండి.
శుభ సమయం: రాత్రి 8:00 నుంచి 9:00 వరకు
కుంభరాశి
ఆలోచనల్లో స్థిరత్వం ఉండాలి. కొత్త ప్రణాళికలు విజయవంతం కావచ్చు. సాంకేతిక రంగాల వారికి అదృష్టం అనుగుణంగా ఉంటుంది. మిత్రుల సహకారం తోడు ఉంటుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు.
పరిహారం: తులసి చుట్టూ ప్రదక్షిణలు చేయండి.
శుభ సమయం: మధ్యాహ్నం 1:00 నుంచి 2:30 వరకు
మీనరాశి
ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మానసికంగా ప్రశాంతత ఏర్పడుతుంది. విద్యార్థులకు ప్రత్యేకమైన అవకాశాలు, గైడెన్స్ లభించవచ్చు. పెద్దల మాటలు వినటం మంచిది. వ్యాపారాలు కలిసి వస్తాయి.
పరిహారం: గురుపూజ చేయండి లేదా దత్తాత్రేయ స్తోత్రం పఠించండి.
శుభ సమయం: ఉదయం 7:30 నుంచి 9:00 వరకు