12/06/2026
June 12 Horoscope 2026

June 12 Horoscope 2026

అధిక జ్యేష్ఠ మాస బహుళ పక్ష ద్వాదశి, శుక్రవారం, జూన్‌ 12 రోజు జ్యోతిష్య పరంగా, ఆధ్యాత్మిక పరంగా విశేష ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈరోజు సాయంత్రం 7.36 గంటల వరకు ద్వాదశి తిథి కొనసాగి అనంతరం త్రయోదశి ప్రారంభమవుతుంది. త్రయోదశి తిథి ప్రదోష కాలంలో ఉండటం వల్ల ఈ రోజు “శుక్ర ప్రదోష వ్రతం”గా శైవ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన రోజుగా భావిస్తారు.

శివభక్తులు ఈ రోజు ఉపవాసం పాటించి ప్రదోష సమయంలో పరమశివుడికి రుద్రాభిషేకం, బిల్వార్చన, శివ నామస్మరణ చేయడం ద్వారా విశేష పుణ్యఫలితాలు పొందుతారని పురాణాలు చెబుతున్నాయి. ముఖ్యంగా శుక్రవారం రోజున వచ్చే ప్రదోషం శుక్రగ్రహ సంబంధిత దోషాల నివారణకు, దాంపత్య సౌఖ్యం, ఐశ్వర్యం, కుటుంబ శాంతి కోసం ఎంతో శ్రేయస్కరంగా పరిగణించబడుతుంది.

ఇక ఈ రోజు ఉదయం సూర్యోదయం నుంచి అశ్వినీ నక్షత్రం కొనసాగడం వల్ల సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడింది. ఉదయం 6.28 గంటల వరకు కొనసాగిన ఈ యోగం కొత్త కార్యక్రమాలు ప్రారంభించడానికి, వ్యాపార ఒప్పందాలు చేసుకోవడానికి, శుభకార్యాలకు శ్రీకారం చుట్టడానికి అనుకూలమైన సమయంగా జ్యోతిష్య శాస్త్రం పేర్కొంటుంది.

Read More: పంచాంగంః జూన్‌ 12, శుక్రవారం

మేషరాశి
ఈరోజు ఈరాశివారికి కొంతమంది ప్రేరణగా నిలుస్తారు. ఏపని మొదలుపెట్టినా అంకితభావంతో చేయాల్సి ఉంటుంది. గతంలో చేసిన రుణాల కారణంగా ఈరోజు కొంత ఒత్తిడికి గురౌతారు. ప్రయాణాలకు అనుకూలమైన రోజు. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది.
వృషభరాశి
ఈరోజు మీరు చేపట్టిన పనులు ముందుకు సాగుతాయి. అయితే, ఫలితాలు మిశ్రమంగా ఉండే అవకాశం ఉంది. కుటుంబం నుంచి సహాయం లభిస్తుంది. ఉద్యోగావకాశాలు ఉన్నాయి. వృత్తి విద్యలో విద్యార్థులు రాణిస్తారు.
మిథునరాశి
ఈరోజు ఈరాశివారు చేపట్టిన పనుల్లో ఆశించిన విజయాలు ఉంటాయి. ఆర్థికంగా కొంత పర్వాలేదనిపిస్తుంది. ఉద్యోగాల్లో అనుకూలత ఉంటుంది. ఇబ్బందులు కొంత వరకు పరిష్కారమౌతాయి. నిరుద్యోగులకు అనుకూలమైన సమయం. ఉద్యోగంలో మార్పులకు ఈరోజు వీలైనంత వరకు దూరంగా ఉండాలి. క్రయ విక్రయాలకు అనుకూలమైన రోజు.
కర్కాటకరాశి
ఈరోజు ఈరాశివారికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. కొన్ని నూతన ఒప్పందాలు చేసుకుంటారు. కుటుంబంలో సఖ్యత ఏర్పడుతుంది. బంధుమిత్రులతో ఇళ్లు కళకళలాడుతుంది. అదనపు ఆదాయం కోసం చేస్తున్న ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి.
సింహరాశి
ఈరోజు ఈరాశివారికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. కొన్ని విషయాల్లో పట్టుదలతో, సహనంతో వ్యవహరించాల్సి ఉంటుంది. నిర్ణయాలను కఠినంగా అమలు చేయాలి. ఖర్చులను నియంత్రించుకోవాలి. ఇక ప్రయాణాలు చేస్తే… జాగ్రత్తలు తీసుకోవాలి.

Also Read  ప్రేమలో మోసపోవడానికి… ఈ దోషాలే ప్రధాన కారణం… ఇలా చేసి చూడండి

Read More: వావ్‌…15 నిమిషాల్లో పదేళ్లు తగ్గిపోయింది… ముసలోళ్లుకూడా యవ్వనంగా


కన్యారాశి
ఈరోజు ఈరాశివారికి గ్రహాలు కొంత వ్యతిరేకంగా ఉన్నాయి. వృత్తి ఉద్యోగ రంగాల్లో కొంత ఒత్తిడి పెరుగుతుంది. ఆర్థికంగా ఇబ్బందులు ఎదురైనా క్రమశిక్షణతో వ్యవహరించి ముందుకు సాగుతారు. మీరు కొన్ని పనులను వాయిదా వేసుకోవడం మంచిది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు.
తులారాశి
మీరు తలపెట్టిన ప్రయత్నాలు ఈరోజు వేగంగా పూర్తవుతాయి. గ్రహాలు అనుకూలంగా ఉండటంతో పలు అవకాశాలు కలిసి వస్తాయి. ప్రభుత్వం నుంచి మీకు అందవలసిన సహాయ సహకారాలు పూర్తిగా అందుతాయి. ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
వృశ్చికరాశి
ఈరోజు ఈరాశివారికి ఫలితాలు మధ్యస్థంగా ఉన్నాయి. మీరు చేస్తున్న పనుల కారణంగా కొంత ఒత్తిడి పెరుగుతుంది. అయితే, ఆర్థికంగా అనుకూలంగా ఉండటం కలిసి వచ్చే అంశం. కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. మీరు కోరుకుంటున్న మార్పు క్రమంగా అమలు జరుగుతుంది. నిరుద్యోగులకు కలిసివస్తుంది.
ధనస్సురాశి
ఈరోజు మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. కుటుంబం నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. ఆర్థికంగా ప్రణాళికలు వేసుకుంటారు. ఉద్యోగులకు ప్రమోషన్లు లేదా బదిలీలు ఉండే అవకాశం ఉంది. నూతన వస్తువులు కొనుగోలు లేదా అమ్మకాలను అనుకూలంగా ఉంది.
మకరరాశి
ఈరోజు శ్రమ పెరుగుతుంది. కొన్ని అదనపు బాధ్యతలు స్వీకరించాల్సి వస్తుంది. ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యమైన పనులను వీలైనంత వరకు వాయిదా వేయడం మంచిది. సమయాన్ని వృధా చేసుకోరాదు.
కుంభరాశి
ఈరోజు మీరు చేపట్టిన పనులు కొంత వరకు పూర్తి చేస్తారు. ఆర్థికంగా మీకు అనుకూలంగా ఉండటంతో జీవితంలో నిలదొక్కుకునేందుకు మార్గాలు సుగమం అవుతాయి. విద్యార్థులు ఈరోజు వారి ప్రతిభను చాటుతారు. నిరుద్యోగులకు మంచి అవకాశాలు ఉన్నాయి.
మీనరాశి
ఈరోజు ఈరాశివారికి ఫలితాలు కొంత అనుకూలంగా ఉన్నాయి. అయితే, ఈరోజు కొత్త పనులు ప్రారంభించడాన్ని వాయిదా వేసుకోవాలి. ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. మాట పట్టింపులకు పోకుండా ఉండటమే మేలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *