13/06/2026
Peddi Box Office Collection

Peddi Box Office Collection

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన వసూళ్లతో దూసుకెళ్తోంది. దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కించిన ఈ ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా ఇప్పటికే చరణ్ కెరీర్‌లో సోలో హీరోగా అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. విడుదలైన 9 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.366 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.

Also Read: సీఎం హోదాలో స్వయంగా కాన్వాయ్‌ నడిపిన విజయ్‌

వీకెండ్ బుకింగ్స్ కూడా బలంగా ఉండటంతో త్వరలోనే రూ.400 కోట్ల మార్క్‌ను చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే జోరు కొనసాగితే రూ.500 కోట్ల క్లబ్‌లోకి కూడా ‘పెద్ది’ అడుగుపెట్టడం ఖాయమనే అభిప్రాయం ట్రేడ్ వర్గాల్లో వ్యక్తమవుతోంది. సంగీతాన్ని ఏఆర్ రెహమాన్ అందించగా, ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది.

Also Read  విఅజయ్ దేవరకొండ కొత్త సినిమా అప్డేట్ వచ్చేది రేపే…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *