సముద్రంపై విమానం ప్రయాణం చేస్తుంటే కిటికీలోనుంచి కిందకు చూడాలంటే భయపడిపోతాం. ఎక్కడ ప్రమాదం జరుగుతుందో ఎక్కడ సముద్రంలో పడిపోతామో అనే భయం సహజంగా అందరికీ ఉంటుంది. అదే సముద్రంపై మనం విమానంలో ప్రయాణం చేసే సమయంలో అనుకోకుండా సముద్రం లోపల అగ్నిపర్వతం బద్దలై ఒక్కసారిగా సముద్రంపైకి మంటలు, పొగ ఎగసిపడితే… ప్రత్యక్షంగా మనం అలాంటి వాటిని వీక్షిస్తే మనం క్షేమంగా తిరిగి భూమిపై ల్యాండింగ్ అవుతామా అనే డౌట్ వస్తుంది కదా. ఎంత కాదని చెప్పినా…మనసులో మూల ఈరోజుతో మనకు ఆఖరు. భూమిపై నూకలు చెల్లిపోయాయి అనిపిస్తుంది. ప్రాణాలమీదకు వస్తే ఎవరికైనా భయం ఉండి తీరుతుంది కదా.
ఇదిగో ఇక్కడ చూపించిన వీడియోను ఒక్కసారి చూస్తే గుండెలు తప్పక ఆగిపోతాయి. అంత భయంకరంగా ఉంది ఈ దృశ్యం. భూమిపై కంటే కూడా సముద్రంలోనే ఎక్కువ సంఖ్యలో అగ్నిపర్వతాలు ఉన్నాయి. నిత్యం ఎక్కడో ఒకచోట అగ్నిపర్వతం బద్దలై లావా ఎగసి పడుతూనే ఉంటుంది. ప్రకృతి తన ధర్మాన్ని తాను నిర్వహిస్తూ ఉంటుంది. ఇక్కడ వీడియోలో చూపింది కూడా అదే. అయితే, బద్దలైన అగ్నిపర్వతం శక్తివంతమైనది కావడంతో మంటలు సముద్రంపైకి కనిపిస్తున్నాయి. కీలోమీటర్ల ఎత్తులో బూడిద ఎగిసి పడింది. ఆ సమయంలో అటువైపుగా వస్తున్న ఓ ఆర్మీ విమానం ఆ దృశ్యాలను వీడియోగా చిత్రీకరించింది. యాష్ వర్సెస్ ప్లెయిన్ పేరుతో ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నది. మీరుకూడా ఈ వీడియోపై ఓ లుక్కేయండి. వీడియో ఎలా ఉందో మా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి.