జీవితంలో ఒక్కసారైనా వీటిని చూసి తీరాలి

Must-Visit Wonders You Should See At Least Once in Your Lifetime
Spread the love

మనిషి జీవితం చాలా చిన్నది. ప్రతి ఒక్కరూ ఒక్కో లక్ష్యంతో పనిచేస్తుంటారు. ఎంత పనిచేసినా కొంత రిలాక్స్‌ ఉండాలి. ముత్యాల ముగ్గు సినిమాలో రావు గోపాలరావు చెప్పినట్టు మనిషన్న తరువాత కాస్తంత కళాపోషణ ఉండాలి… అన్నట్టుగా ఎంత పని చేసినా కూడా కాసేపు రిలాక్స్‌ ఉండాలి. రిలాక్స్‌ కోసం ఒక్కొక్కరు ఒక్కో అంశాన్ని ఎంచుకుంటారు. ట్రావెల్‌ చేస్తూ ఎంజాయ్‌ చేస్తుంటారు. ట్రావెల్‌ అంటే ఇష్టపడేవారు జీవితంలో ఒక్కసారైనా సరే వీటిని చూసి తీరాలి. ఇందులో ప్రధానమైనవి 10 ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Sri Ananta Padmanabha Swamy Temple (Trivandrum)
శ్రీపద్మనాభ స్వామి ఆలయం, తిరువునంతపురం. కేరళలోని శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయాన్ని జీవితంలో ఒక్కసారైనా చూసి తీరాలి. ఈ ఆలయంలో ప్రతి ఒక్కటి ఒక్కో అపురూరం. గోపురం నుంచి గర్భగుడిలోని పద్మనాభ స్వామివారి వరకు ప్రతిదీ ప్రత్యేకమే.
Vertical Forest in Milano with Eterno Ivica
బోస్కో వెర్టికాలే (Bosco Verticale – వెర్టికల్ ఫారెస్ట్)- ఇటలీలోని మిలాన్‌ నగరంలో ఉన్న రెండు అపార్ట్మెంట్ల మధ్య పై వరకు సుమారు 2వేలకు పైగా చెట్ల జాతులను పెంచుతున్నారు. దీనిని వెర్టికల్‌ ఫారెస్ట్‌ అని పిలుస్తున్నారు.
The Interlace: Singapore's luxury housing - ICON Magazine
ది ఇంటర్‌లేస్ (The Interlace): సింగపూర్‌లోని బుకిట్ మేరా, క్వీన్‌స్టౌన్ సరిహద్దులో ఉన్న ఒక ఆధునిక నివాస సముదాయం. ఇక్కడ మొత్తం 1400 అపార్ట్‌మెంట్లు ఉంటాయి.
Kailasa Temple Is an Incredible Feat of Indian Architecture
కైలాస ఆలయం, ఎల్లోరా గుహలు, భారత్‌ (Kailasha, Ellora Caves, India): ప్రపంచంలోనే అతిపెద్ద ఏకశిలా నిర్మాణం (Monolithic Structure). శతాబ్దాల క్రితం పైనుండి కిందికి (Upside Down) చెక్కి నిర్మించబడింది.
China's wild circular skyscraper opens in Guangzhou [slideshow] | Building  Design+Construction
చైనాలోని గ్వాంగ్‌జౌలో ఉన్న ఈ వృత్తాకార భవనంః టాలియన్ ఆర్కిటెక్ట్ జోసెఫ్ డి పాస్క్వాలే రూపొందించారు. ఈ భవనం ఎత్తు 138 మీటర్లు కాగా, ఇందులో మొత్తం 33 అంతస్తులు ఉంటాయి. దీని ప్రత్యేకమైన, ఆకర్షణీయమైన డిజైన్‌ కారణంగా ఈ భవనం చూసేందుకు సీడీలా ఉంటుంది.
Quarry Bay & Yick Cheong Building - Hong Kong - Arrivalguides.com
హాంగ్‌కాంగ్ “మాన్స్టర్ బిల్డింగ్” – యిక్ చియాంగ్ బిల్డింగ్ (Yick Cheong Building): హాంగ్‌కాంగ్‌లో ప్రసిద్ధి చెందిన ఈ భారీ నివాస సముదాయాన్ని మాన్స్టర్ బిల్డింగ్ అని పిలుస్తారు. దీనిలో మొత్తం 2,243 అపార్ట్‌మెంట్లు ఉండగా, దాదాపు 10,000 మంది ప్రజలు ఇక్కడ నివసిస్తున్నారు.
Smarthistory – The Meenakshi Temple at Madurai
మీనాక్షి అమ్మన్ ఆలయం, తమిళనాడు, భారత్ః ఈ ఆలయంలో 14 అద్భుతమైన గోపురాలు, 33,000కు పైగా శిల్పాలు, అందులో 2 బంగారు విగ్రహాలతో కూడిన విమానాలు, సునిశితమైన శిల్పాలు, అందమైన చిత్రాలు ఉన్నాయి. ప్రాచీన సంస్కృతికి, సంప్రదాయాలకు ఈ ఆలయం చిహ్నంగా ఉండటం విశేషం.
Prague's Astronomical Clock: Decoding the Spectacle
ప్రాగ్ ఖగోళ గడియారం (Prague Astronomical Clock): ఇది 1410 సంవత్సరంలో స్థాపించబడింది. ప్రపంచంలో ఇప్పటికీ పనిచేస్తున్న అత్యంత పురాతన ఖగోళ గడియారం ఇదే.
Interesting Facts About Borobudur Temple | Authentic Indonesia Blog
బోరోబుదూర్ ఆలయం, సెంట్రల్ జావా, ఇండోనేషియా: ప్రపంచంలోనే అతిపెద్ద బౌద్ధ స్మారక చిహ్నం. 9వ శతాబ్దంలో శైలేంద్ర వంశపు రాజు నిర్మించిన ఈ ఆలయం, పవిత్రమైన శ్రీయంత్రం నుండి ప్రేరణ పొందిన ఒక అద్భుతమైన వాస్తు కళాఖండం.
Leshan Giant Buddha: Top Tips & Best Ways to Visit
ప్రపంచంలోనే అతిపెద్ద శిలా బుద్ధ విగ్రహంః లెషాన్ మహాబుద్ధుడు (The Giant Buddha of Leshan). ఇది 8వ శతాబ్దంలో ఒక కొండచరియను చెక్కి నిర్మించినట్టు చరిత్రకారులు చెబుతున్నారు. ఇది సుమారు 233 అడుగుల ఎత్తు ఉంటుంది. ప్రాచీనమైన బుద్ధుని విగ్రహాల్లో ఇదికూడా ఒకటి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *