కర్ణాటక కాంగ్రెస్ పార్టీలో మళ్లీ ముసలం మొదలైంది. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేపట్టిన తొలినాళ్లలో అధికారం కోసం అంతర్గత కుమ్ములాటలు జరిగిన సంగతి తెలిసిందే. అధిష్టానం జోక్యంతో ఈ కుమ్ములాటలకు చెక్ పడింది. కాగా, తాజాగా మరోసారి ఇంటి గొడవలు రచ్చకెక్కడంతో కాంగ్రెస్ పార్టీలో ఒక్కసారిగా కలకలం మొదలైంది. రాహుల్ గాంధీ ఓట్ల చోరీ ఆరోపణలపై కర్ణాటక మంత్రి రాజన్న స్పందించిన తీరు సరిగా లేదనే కారణంగా ఆయన్ను పదవి నుంచి తప్పించింది. పార్టీ నుంచి తప్పించడంతో ఆయన వేరు కుంపటి పెట్టుకునేందుకు సిద్దమౌతున్నారని, కాంగ్రెస్ పార్టీని వదిలి బీజేపీలో చేరబోతున్నారని, బీజేపీ ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్న వారిలో మాజీ మంత్రి రాజన్న కూడా ఉన్నారని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే హెసీ బాలకృష్ణ ఆరోపించారు. కాగా, ఈ ఆరోపణలను కాంగ్రెస్ పార్టీ నేత, రాజన్న కుమారుడు రాజేంద్ర రాజన్న తిప్పికొట్టారు. బీజేపీ ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్న వారిలో హెసీ బాలకృష్ణ కూడా ఉన్నారని, ఆయనే కావాలని ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని, తన తండ్రికి పార్టీ మారే ఉద్దేశం లేదని చెప్పుకొచ్చారు. చాలా కాలం తరువాత మరోసారి రాజకీయంగా కర్ణాటకలో దుమారం రేగడంతో ఈ దుమారం ఎక్కడికి దారితీస్తుందో చూడాలి.
Related Posts

సోషల్ మీడియాలో మలబార్ గోల్డ్ వివాదం…ఇదే కారణం
Spread the loveSpread the loveTweetధనతేరస్ పండుగ ముందు ప్రముఖ ఆభరణాల సంస్థ మలబార్ గోల్డ్ & డైమండ్స్ సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు, బహిష్కరణ పిలుపులను ఎదుర్కొంటోంది. ఈ…
Spread the love
Spread the loveTweetధనతేరస్ పండుగ ముందు ప్రముఖ ఆభరణాల సంస్థ మలబార్ గోల్డ్ & డైమండ్స్ సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు, బహిష్కరణ పిలుపులను ఎదుర్కొంటోంది. ఈ…

సుంకాల కథ… ఇలా మొదలు
Spread the loveSpread the loveTweetసుంకాలు విధింపు చరిత్ర: ప్రాచీన కాలం నుంచి ఆధునిక యుగం వరకు ప్రపంచంలో సుంకాలు విధింపు చాలా ప్రాచీనమైనది. ప్రాచీన కాలంలో, మార్కెట్లలో సరకులు…
Spread the love
Spread the loveTweetసుంకాలు విధింపు చరిత్ర: ప్రాచీన కాలం నుంచి ఆధునిక యుగం వరకు ప్రపంచంలో సుంకాలు విధింపు చాలా ప్రాచీనమైనది. ప్రాచీన కాలంలో, మార్కెట్లలో సరకులు…

భారత్తో యూకే సరికొత్త మైత్రి
Spread the loveSpread the loveTweetయూకే ప్రధాని కియర్ స్టార్మర్ భారత పర్యటనకు వచ్చారు. ఈరోజు ఉదయం ఆయన ముంబైలోని చత్రపతి శివాజీ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యారు. అయితే, ఆయనతో…
Spread the love
Spread the loveTweetయూకే ప్రధాని కియర్ స్టార్మర్ భారత పర్యటనకు వచ్చారు. ఈరోజు ఉదయం ఆయన ముంబైలోని చత్రపతి శివాజీ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యారు. అయితే, ఆయనతో…