“ఎదో అనుకుంటే ఎదో అయ్యిందే…” అనే పాట గుర్తు ఉండే ఉంటుంది కదా… ఈ మధ్య మన తెలుగు సినిమాల గురించి మాట్లాడితే ఆ పాటె గుర్తుకువస్తుంది…
ఐతే మొన్నే హరి హర వీర మల్లు ప్లాప్ ఐంది… కన్నప్ప గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది… ఇక ఇప్పుడు ఘాటీ… అయ్యో ఏంటి రిలీజ్ ఐన రోజే ఈ ఫీడ్ బ్యాక్ అంటే, సినిమా మన క్రిష్ ధీ, అనుష్క నటన, చైతన్య విలనిజం, ఇక కోలీవుడ్ హీరో విక్రమ్ ప్రభు, ఇంత మంది ఉన్నా కానీ సినిమా ఎక్కలేదు అంటున్నారు జనాలు…
అసలు స్టోరీ ట్రైలర్ లోనే తెలుసు కదా… శీలావతి ఇంకా తన ఊరి ప్రజలు ఘాటీ, ఎత్తైన కొండా నుంచి స్మగ్లింగ్ కి హెల్ప్ చేస్తూ ఎంత కష్టపడ్డారో చూపిస్తారు, కానీ శీలావతి తన తప్పు తెలుసుకుని, ఈ పని ఆపేద్దాం అనేసరికి విలన్స్ ఊరుకుంటారా??? లేదు అందుకే, శీలావతి తన వాళ్ళ కోసం లేడీ లెజెండ్ లాగ మారి, స్టోరీ నడిపిస్తుంది…
మరి ఇక ఆ స్టోరీలైన్ క్లీన్ అండ్ క్లియర్ గా తెలుసుకోవాలంటే, సినిమా చూడాలి…
ఇక అనుష్క ఎప్పటిలాగే చింపేసింది… కానీ అంత స్టోరీ అనుకున్నంత SUSPENSE లేకపోవడం తో ఇంకా ELEVATE కాలేదు… విక్రమ్ ప్రభు నటన ఓకే… కానీ చైతన్య ఇక నుంచి టాలీవుడ్ కి ఒక కొత్త విలన్… అతను కూడా చింపేసాడు…
సాంగ్స్ అనుకున్నంత ఎఫెక్ట్ లేవు సో, ఇక ఇది మరి మా నేటి ప్రపంచం రివ్యూ… మీరేమంటారు???
నేటి ప్రపంచం ఘాటీ రివ్యూ…
Spread the love