Native Async

సింహంతో కలిసి మహేష్‌బాబు నడిచి వస్తుంటే…

Mahesh Babu walking with lion
Spread the love

మహేష్‌బాబు – దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు ఎటువంటి ఫొటోస్‌గాని బయటకు రాలేదు. అయితే, ఇటీవలే ఈ సినిమా షూటింగ్‌లో కొంతభాగాన్ని కెన్యా అడవుల్లో షూట్‌ చేశారు. వణ్యప్రాణులు, అటవీ మృగాల మధ్య ఈ సినిమాను షూట్‌ చేసినట్టుగా ఇప్పటికే వార్తలు వచ్చాయి. కానీ, సింహంతో కలిసి మహేష్‌బాబు అద్భుతాలు చేయబోతున్నాడని రాజమౌళి హింట్‌ ఇవ్వలేదు. కానీ, దీనికి సంబంధించిన కొన్ని దృశ్యాలు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ కావడం చర్చనీయాంశంగా మారింది. దృఢమైన శరీరంతో కర్రను పట్టుకొని పక్కనే సింహంతో కలిసి నడిచి వస్తున్న దృశ్యానికి సంబంధించిన లొకేషన్‌ వీడియో బయటకు వచ్చింది. 10 సెకన్ల లోపే ఉన్న ఈ చిన్ని క్లిప్‌ సోషల్‌ మీడియాను ప్రస్తుతం షేక్‌ చేస్తున్నది. మీరు కూడా ఓ లుక్కేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

🔔 Subscribe for Latest Articles
Share: FacebookX/TwitterTelegramWhatsAppLinkedInReddit