తెలంగాణ రాజకీయాలు బాగా వేడిగా ఉన్న సంగతి తెలిసిందే… ఆల్రెడీ BRS పార్టీ నుంచి కవిత ని సస్పెన్షన్ చేసాక, కవిత హరీష్ రావు ఇంకా సంతోష్ మీద సంచలన ఆరోపణలు చేసింది…
అలాగే సంధ్య థియేటర్ లో పుష్ప సినిమా ప్రీమియర్ షో సందర్బంగా ఒక అనుకోని ఘటన వల్ల CM రేవంత్ రెడ్డి కి సినీ ఇండస్ట్రీ కి దూరం పెరిగింది… ఐతే ఇటీవల అల్లు అరవింద్ అమ్మ గారు అల్లు కనకరత్నమ్మ చనిపోవడం తెలిసిందే… ఈ సందర్బంగా కనకరత్నమ్మ దశదిన కర్మ కి KTR హాజరై అల్లు అరవింద్ ఇంకా అల్లు అర్జున్ ని పరామర్శించడం జరిగింది.
https://www.instagram.com/reel/DOVnwFRApFM/?igsh=MWhzNGwydWxmbHVxMw==
ఈ విషయాన్ని KTR తన ఇంస్టాగ్రామ్ లో కూడా షేర్ చేసి అల్లు ఫామిలీ తో ఉన్న పిక్ షేర్ చేసాడు… “తెలుగు చలనచిత్ర మహానటుడు, దివంగత పద్మశ్రీ అల్లు రామలింగయ్య గారి సతీమణి అల్లు కనకరత్నమ్మ గారి దశదినకర్మకు హాజరయి నివాళులర్పించాము. ఈ సందర్భంగా ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్ గారిని, అలాగే @alluarjunonline గారిని కలిసి పరామర్శించడం జరిగింది.”