నేపాల్ లో జరుగుతున్న అల్లర్లుకు గాజులరేగ ఒక్కసారి ఉలిక్కిపడింది.ఆ దేశానికి గాజులరేగ ఎక్కడ…దానికి సంబందం ఏంటని సమాలోచనలు చేస్తున్నారు కదా…సంచలనాత్మక, సరికొత్త ఆన్ లైన్ వెబ్ సైట్ ” నేటి ప్రపంచం.కామ్ “అక్కడకే వస్తోంది…! ఆ సంశయమే తీర్చబోతోంది. ఈ నెల 3వ తేదీన ఏపీలోని విజయనగరం గాజులరేగ కు చెందిన 34 మంది నేపాల్ లోని మానస సరోవర్ యాత్రకు వెళ్లారు. సీన్ కట్ చేస్తే..సోషల్ మీడియాలో నేపాల్ లో అల్లకల్లోలం ధ్వంసం అవుతో్న్న దేశం అన్న వార్తలు ట్రోల్ అవుతున్నాయి.
దీంతో గాజులరేగ నుంచీ వెళ్లి వారికి కోసం స్థానికులతో పాటు అక్కడకు వెళ్లిన యాత్రికుల బంధవులు ఆందోళన చెందారు.ఈ ఆందోళనలకు, నేపాల్ వెళ్లిన 34 మంది యాత్రికులు క్షేమం అని అదీ ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ద్వారా వారంతా క్షేమమని సురక్షితంగా ప్రత్యేక విమానంలో ఖాట్మండు నుంచీ విశాఖకు రానున్నారని తెలిసి ఊపిరి పీల్చుకున్నారు.గాజులరేగకు చెందిన 34 మందిని విశాఖ నుంచీ తీసుకు వచ్చేందుకు విజయనగరం కలెక్టరేట్ నుంచీ ఇన్నోవా కార్లు బయలు దేరాయి.