సిద్ధూ జొన్నలగడ్డ… టాలీవుడ్ లో అంత తొందరగా ఒక హీరో కి హిట్ పడదు… కానీ ఒక్కసారి క్లిక్ అయ్యాడంటే, ఫ్యాన్ బేస్ పెరిగిపోతుంది అలానే సినిమాలు లు కూడా బాగా లైన్-అప్ అవుతాయి. ఆ జాబితాలో ఉండే హీరోనే మన సిద్ధూ జొన్నలగడ్డ. DJ TILLU సినిమా తో మంచి హిట్ కొట్టి, దాని సీక్వెల్ తో కూడా పర్వాలేదు అనిపించాడు. కానీ తన తరవాత సినిమా జాక్ ఎందుకో ఆడలేదు.
ఇప్పుడు నీరజ కోన దర్శకత్వం లో GENZ లవ్ స్టోరీ ‘తెలుసు కదా’ తో మల్లి థియేటర్స్ లోకి రాబోతున్నాడు. ఈ సినిమా వచ్చే నెలలోనే రిలీజ్ ఉంది కాబట్టి, ప్రోమోషన్స్ గట్టిగా చేస్తున్నారు.
అందులో భాగంగా, ఈరోజు తెలుసు కదా టీజర్ రిలీజ్ చేసారు… ఐతే, మనం అనుకున్నట్టే ఇది కంప్లీట్ GEN Z లవ్ స్టోరీ. ఒక పక్క రాశి ఖన్నా తో రొమాన్స్ ఇంకో పక్క శ్రీనిధి శెట్టి తో కూడా రొమాన్స్… ఆమ్మో ఇద్దరు అంటే yes ఇద్దరే! ఇంకా పైగా ఫస్ట్ షాట్ లోనే ఇద్దరికీ పెళ్లి తంతు లో భాగంగా పసుపు కూడా రాస్తాడు హీరో… ఆమ్మో ఇద్దరినీ లైన్ లో పెట్టి, వాళ్ళతో రొమాన్స్ చేసి, మళ్ళి ఇద్దరికీ ఆ విషయం చెప్పి, ఇద్దరినీ ఒప్పించి… ఆమ్మో ఇది ఎలా సాధ్యం అంటే సినిమా చూడాల్సిందే ఏమో!
ఈ సినిమా ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మిస్తున్నారు… అలానే దీపావళి పండగ కి కొంచం ముందు అంటే 18 అక్టోబర్ న సినిమా థియేటర్స్ లోకి రావడానికి రెడీ గా ఉంది!