నిన్నే టాలీవుడ్ అందాల బొమ్మ సంయుక్త మీనన్ తన ౨౯ వ పుట్టిన రోజు ఘనంగా జరుపుకుంది… ఈ సందర్బంగా సోషల్ మీడియా మొత్తం ఆమె ఫాన్స్ హల చల్ చేసారు. అలానే సంయుక్త చేసే నెక్స్ట్ సినిమా పోస్టర్స్ కూడా అంతే హడావిడి సృష్టించాయి.
ఇంతకీ సంయుక్త చేతిలో ఎన్ని సినిమాలు ఉన్నాయో తెలుసా??? ఒకటో రెండో అనుకునేరు… లేదు ఏకంగా ఎనిమిది సినిమాలు ఉన్నాయ్!
సంయుక్త మీనన్ మొదట్లో, మలయాళం తమిళ్ సినిమాలు చేస్తూ బిజీ గా ఉండేది… కానీ పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్, కళ్యాణ్ రామ్ బింబిసారా సినిమాలు ఆమెకి మంచి బ్రేక్ ఇచ్చాయి…
అలానే నెక్స్ట్ ధనుష్ తో చేసిన సర్ ఇంకా కళ్యాణ్ రామ్ డెవిల్ సినిమాలు కూడా మంచి హిట్ అయ్యాయి. ఇంకా సాయి ధరమ్ తేజ్ విరూపాక్ష లో అటు హీరోయిన్, లాస్ట్ లో విలన్ లాగ కనపడి చంపేసింది. అలా ఇప్పుడు తాను టాలీవుడ్ లో ట్రేండింగ్ హీరోయిన్…

ఐతే తన నెక్స్ట్ సినిమాల లిస్ట్ చూద్దామా:
1. నందమూరి బాలకృష్ణ అఖండ 2… ఈ సినిమా తొందరలోనే రిలీజ్ కి రెడీ గా ఉంది.
2. ఇక నెక్స్ట్ కాజోల్, ప్రభు దేవా, నసీరుద్దీన్ షా ల యాక్షన్ హిందీ సినిమా ‘Maharagni: Queen of Queens’.
3. నెక్స్ట్ నిఖిల్ తో చేస్తున్న ‘స్వయంభు’… ఈ సినిమా కూడా ఒక పోరాట యోధుడి కథ.
4. తరువాత మలయాళం లో మోహన్ లాల్ తో చేస్తున్న ‘రామ్’.
5. నెక్స్ట్ శర్వానంద్ తో చేస్తున్న లవ్ స్టోరీ ‘నారి నారి నడుమ మురారి’…
6. తరువాత సినిమా లోకేష్ కానగరాజ్, లారెన్స్, నవీన్ పౌలీ ల ‘బెంజ్’ సినిమా.
7. ఇక నెక్స్ట్ పూరి విజయ్ సేతుపతి ల సినిమా చేస్తుంది…
8. ఇక లాస్ట్ కి బెల్లంకొండ శ్రీనివాస్ తో చేస్తున్న హైందవ సినిమా…
అవును ఇన్ని మంచి సినిమాలు చేస్తుంది సంయుక్త మీనన్…