మంచు ఫామిలీ లో గొడవలు సమసిపోతున్నాయా??? అన్న తమ్ములు కలిసిపోయారా??? అబ్బా వినడానికి ఎంత బాగుందో కదా ఈ మాట. లెజెండరీ నటుడు మంచు మోహన్ బాబు ఇద్దరు కొడుకుల గొడవ మనందరికీ తెలిసిందే కదా…

కొన్ని రోజుల క్రితం విష్ణు మంచు డ్రీం ప్రాజెక్ట్ కన్నప్ప రిలీజ్ అయినప్పుడు మనోజ్ ఆ సినిమా హిట్ అవ్వాలని మనసారా కోరుకుంటూ, ట్విట్టర్ లో ఒక కదిలించే పోస్ట్ పెట్టాడు… ఆ పోస్ట్ లో అన్న పేరు మెంతిఒన్ చేయలేదు కానీ, అన్న పిల్లలు, తన తండ్రి పేరు మెన్షన్ చేసి, సినిమా సక్సెస్ అవ్వాలని కోరుకున్నాడు.
ఐతే మిరాయి సినిమా ఈరోజే రిలీజ్ అయ్యింది అని తెలుసు కదా… SAME మనోజ్ ఎలా ఐతే సోషల్ మీడియా లో కన్నప్ప టీం కి పోస్ట్ పెట్టాడో, విష్ణు కూడా అలాగే ట్విట్టర్ లో పోస్ట్ పెట్టాడు.
ఈ పోస్ట్ లో మంచు మనోజ్ ని మెన్షన్ చేయకపోయినా, సినిమా కి ఐతే బెస్ట్ విషెస్ చెప్పాడు విష్ణు…
అలానే సినిమా సక్సెస్ అయినందుకు మంచు మనోజ్ అందరికి చాల రుణపడి ఉంటాను అని చాల ఆనందించాడు…
“A journey that tested me. Defined me. And today with your love celebrates me. “
ఇక మిరాయి సినిమా గురించి అందరు ఇలా పాజిటివ్ రివ్యూస్ ఇస్తుంటే చాల బాగా అనిపిస్తుంది. ఇది మనోజ్ కి గట్టి కం బ్యాక్ అని, ఇంకా టాలీవుడ్ కి కొత్త విలన్ దొరికేసినట్టే అని అందరు అంటున్నారు…
అలానే అడివి శేష్, ప్రశాంత్ వర్మ, రోహిత్ నారా కూడా సినిమా పై మంచి postive రివ్యూస్ సోషల్ మీడియా లో పోస్ట్ చేసారు…
మొత్తానికి తేజ సజ్జ, మంచు మనోజ్ కుంభ స్థలాన్ని బద్దలు కొట్టారు… అందుకే వెయిటింగ్ ఫర్ MIRAI 2…