మిరై సినిమా విజయం – హాలీవుడ్ స్థాయిలో మెప్పించిన హైదరాబాదు VFX…
సెప్టెంబర్‌లో ప్రేక్షకులను ఆకట్టుకున్న హిట్ చిత్రాల్లో మిరాయి ఒకటి. లిటిల్ హార్ట్‌స్ తర్వాత బాక్సాఫీస్ వద్ద మంచి రివ్యూలు, కలెక్షన్లు అందుకుంటూ మరో విజయవంతమైన చిత్రంగా నిలిచింది. రిలీజ్ డే నుంచే బలమైన నెంబర్స్‌తో ముందుకు సాగిన ఈ సినిమాకి, ముఖ్యంగా టెక్నికల్ వర్క్‌కి ఇప్పుడు ప్రశంసలు కురుస్తున్నాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే – మిరైలో కనిపించిన హాలీవుడ్ రేంజ్ విజువల్స్ వెనుక ఉన్న టెక్నీషియన్లు హైదరాబాదులోని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఉద్యోగులు కావడం!
ట్రైలర్ విడుదలయ్యే సమయానికే అందరినీ విస్మయానికి గురిచేసిన ఈ విజువల్స్, VFX బ్రేక్‌డౌన్ వీడియో వచ్చాక అయితే ప్రేక్షకులు షాక్ అయ్యారు. ఇప్పుడు థియేటర్లలో సినిమా చూసినవాళ్లకు పెద్ద స్క్రీన్‌పై కనిపిస్తున్న గ్రాఫిక్స్ స్థాయికి మాటలు రావడం లేదు. అంతేకాదు, భారీ బడ్జెట్‌తో వచ్చిన అనేక సినిమాలు VFX పరంగా విఫలమవుతుంటే, తక్కువ వనరులు, ఎన్నో పరిమితులు ఉన్నప్పటికీ మిరైతో ఇచ్చిన అవుట్‌పుట్ అందరినీ ఆశ్చర్యపరిచింది.
DI పనిలో కూడా జాగ్రత్తగా చూసుకోవడం వల్లే ఒక్క సీన్ కూడా బ్లర్ కాకుండా, స్పష్టమైన విజువల్ అనుభవం ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఈ అవుట్‌పుట్ హైదరాబాదు టెక్నీషియన్ల ప్రతిభకు ఒక గొప్ప ఉదాహరణగా నిలిచింది.

ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే – ఇదే బ్యానర్‌లో వస్తున్న ప్రభాస్ సినిమా రాజా సాబ్ కూడా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. హారర్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కూడా ఎక్కువ భాగం సెట్స్‌లోనే షూట్ చేశారు కాబట్టి భారీ స్థాయి VFX అవసరం ఉంటుంది. ఇప్పటికే వచ్చిన టీజర్ బాగానే ఆకట్టుకుంది. ఇప్పుడు మిరాయి లాంటి క్వాలిటీ అవుట్‌పుట్ అందిస్తే, ఈ సినిమా కూడా మరో అద్భుతాన్ని చూపించగలదని అభిమానులు ఆశతో ఎదురుచూస్తున్నారు.

సరైన క్వాలిటీని సాధిస్తే, ఇంతవరకు VFX విషయంలో ఇబ్బందులు పడుతున్న నిర్మాతలకు కూడా ఇది ఒక కొత్త దారిగా మారుతుంది. తెలుగు సినిమాకు ఒక నూతన శకం తెచ్చినట్టు మిరాయి చూపించిన ఈ విజువల్ మాయాజాలం నిజంగా గర్వపడే స్థాయిలో ఉంది.