తేజ సజ్జ, మంచు మనోజ్ ల మిరాయి సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిందే కదా. అందుకే సినిమా యూనిట్ అంత పెద్దగా మంచిగా సక్సెస్ మీట్ ఏర్పాటు చేసారు… ఈ ఈవెంట్ లో మంచు మనోజ్, తేజ, ఇంకా టీం అంత పార్టిసిపేట్ చేసి చాలా ఎమోషనల్ అయ్యారు. ఇంత పెద్ద విజయం తేజ, మనోజ్ కెరీర్స్ కి మంచి పునాది వేసింది…

అందుకే మనోజ్ కూడా ఇంత మంచి కం బ్యాక్ ఇచ్చినందుకు టీం అందరికి థాంక్స్ చెప్తూ ఎమోషనల్ స్పీచ్ ఇచ్చి కళ్ళల్లో నీళ్లు తెప్పించాడు మరి… మన బ్లాక్ స్వోర్డ్ ఎం మాట్లాడాడో తెలుసా:
‘‘ఈరోజు ఎంతో ఆనందంగా ఉంది. 12 ఏళ్ల తర్వాత సక్సెస్‌తో నా ఫోన్ మోగుతూనే ఉంది. అభినందనలు వస్తున్నప్పటికీ నాకు ఇదంతా కలలా ఉంది. ఈ కథలో నన్ను భాగం చేసినందుకు కార్తిక్‌కు జన్మంతా రుణపడి ఉంటాను. ఇంతకుముందు నేను ఎక్కడికి వెళ్లినా ‘అన్నా సినిమా ఎప్పుడు తీస్తావు. కమ్‌బ్యాక్ ఎప్పుడు?’ అని అందరూ అడిగేవారు. త్వరలోనే వస్తాను అని చెప్పేవాడిని. వాళ్లతో బయటకు ధైర్యంగా మాట్లాడినా.. లోపల తెలియని భయం ఉండేది. చాలా సినిమాలు చివరి నిమిషంలో క్యాన్సిల్ అయ్యాయి. ఒకటి అనుకుంటే మరోటి అయ్యేది. అలాంటి టైమ్‌లో కార్తిక్ నన్ను నమ్మడం నా అదృష్టం. మీరు నన్ను మాత్రమే నిలబెట్టలేదు.. నాతో పాటు నా కుటుంబాన్ని కూడా నిలబెట్టారు.’
నేను పెరిగినట్లు నా పిల్లల్ని పెంచగలనా అని ఎప్పుడూ భయపడుతూ ఉండేవాడిని. ఆ భయాన్ని కార్తిక్ తీసేశారు. నిర్మాత కూడా ఎంతో ధైర్యంగా దీన్ని పూర్తిచేశారు. ‘మనోజ్‌తో సినిమా వద్దు’ అని ఆయనకు ఎంతోమంది చెప్పి ఉంటారు. అవేవీ వినకుండా విశ్వప్రసాద్ దీన్ని నిర్మించారు. ‘మిరాయ్’ వీఎఫ్‌ఎక్స్ టీమ్ తెలుగు సినిమా గర్వపడేలా చేసింది. ముఖ్యంగా ఒక విషయం చెప్పాలి. ప్రతి ఇంట్లో నుంచి మనోజ్ గెలవాలి అని కోరుకున్న వారందరికీ పేరుపేరునా పాదాభివందనం. నామీద నమ్మకం పెట్టుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు. ఇకపై వరుస సినిమాలు చేస్తూ మీ అందరినీ అలరిస్తాను’’ అని మనోజ్ అంటూ చాల సంతోషంగా కనిపించాడు.

మిరాయి సినిమా మొదటి రోజు 27 కోట్లు కలెక్ట్ చేసింది…