బాలీవుడ్ స్టార్ ఆమీర్ ఖాన్ ఇటీవల సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన కూలీ సినిమాలో చిన్న క్యామియో చేశారు. అయితే నిన్న సోషల్ మీడియాలో ఓ ఆర్టికల్ వైరల్ అవుతూ… ఆమీర్ ఈ సినిమా చేయడం పెద్ద తప్పు అని చెప్పినట్టు ప్రచారం జరిగింది. అందుకే ఈ వార్తపై అభిమానుల్లో సందేహాలు తలెత్తాయి.
తాజాగా ఆమీర్ టీమ్ క్లారిటీ ఇచ్చింది. “ఆమీర్ ఖాన్ ఎలాంటి నెగెటివ్ కామెంట్స్ చేయలేదు. కూలీ టీమ్‌కి ఆయనకు అత్యధిక గౌరవం ఉంది. సినిమా బాక్సాఫీస్ వద్ద 500 కోట్లకు పైగా వసూలు చేసింది. అదే సాక్ష్యం” అని స్పష్టం చేశారు.

పైగా ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో ఆమిర్ ఖాన్ మాట్లాడుతూ, లోకేష్ ఈ సినిమా స్టోరీ చెప్పడానికి వచ్చినపుడు, తాను ఇది రజినీకాంత్ సినిమా కాబట్టి, స్టోరీ వినకుండానే ఓకే చెప్పను అని చెప్తూ, ఇలా చేయడం నా సినీ కెరీర్ లో ఫస్ట్ టైం అని కూడా అన్నాడు!

ఆమీర్, రజనీకాంత్‌పై ఉన్న అభిమానంతో పాటు దర్శకుడు లోకేష్ కనగరాజ్‌తో చేయబోయే ప్రాజెక్ట్‌కి గౌరవంగా ఈ సినిమా చేశారని కూడా చెప్పేశారు. అయితే ఆయన చేసిన చిన్న క్యామియోపై వచ్చిన విమర్శలు, ట్రోల్స్ మాత్రం నెగెటివ్ షేడ్స్ తెచ్చాయి. కూలీ మాత్రం ఎల్సీయూలో భాగం కాకుండా బాక్సాఫీస్ వద్ద సగటు ఫలితమే సాధించింది.