Native Async

ఉస్తాద్ షూట్ కంప్లీట్ చేసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

Pawan Kalyan Completes Ustaad Bhagat Singh Shhot
Spread the love

పవన్ కళ్యాణ్… ఇప్పుడు అయన జస్ట్ మన టాలీవుడ్ పవర్ స్టార్ కాదు కదా! ఆయన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా, నాలుగు కీలక శాఖల బాధ్యతలు భుజాన వేసుకున్నారు. ఇంత బిజీ రాజకీయ షెడ్యూల్ ఉన్నా కూడా, అభిమానులకు సర్ప్రైజ్ ఇస్తూ నాలుగు నెలల్లో మూడు పెండింగ్ సినిమాల షూటింగ్ పూర్తిచేయడం ఒక పెద్ద ఘనతే. మాట ఇచ్చిన ప్రకారం సినిమాలు కంప్లీట్ చేసి, సినిమాలు అంటే ఎంత ఇష్టమో అని చేసి చూపించారు!

2024 ఎన్నికల ముందు పవన్ ఫోకస్ మొత్తం రాజకీయాలపైనే ఉండటంతో, ఆయన సినిమాలు మధ్యలో ఆగిపోయాయి. వాటిలో హరి హర వీర మల్లూ, OG, ఉస్తాద్ భగత్ సింగ్ ఉన్నాయి. కానీ ఎన్నికలు ముగిసిన వెంటనే, పవన్ ఒక్కో సినిమా సెట్స్‌కి వెళ్లి తాను చేయాల్సిన పార్ట్‌ని స్పీడ్‌గా పూర్తి చేశారు.

ముందుగా మేలో హరి హర వీర మల్లూ పూర్తి చేసి, జూలైలో థియేటర్స్‌లో రిలీజ్ అయ్యింది. దానికి వెంటనే జూన్‌లో OG సినిమా షూటింగ్ ముగించి, ఇప్పుడు సెప్టెంబర్ 25న రిలీజ్‌కి సిద్ధం చేస్తున్నారు. ఇకపోతే ఉస్తాద్ భగత్ సింగ్ విషయంలో దర్శకుడు హరీష్ శంకర్ స్పీడ్‌గా షూట్ చేయడంతో పవన్ తన పార్ట్ మొత్తాన్ని త్వరగా పూర్తి చేశారు. ఇంకా ఇతర ఆర్టిస్టులతో మిగిలిన సీన్స్ నెమ్మదిగా షూట్ అవుతున్నాయి.

ఇవాళ హీరోయిన్ రాశీ ఖన్నా పవన్‌తో తీసుకున్న సెల్ఫీని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, షూట్ పూర్తయిందని కన్‌ఫర్మ్ చేసింది.

అలాగే డైరెక్టర్ హరీష్ శంకర్ కూడా పవన్ తన షూట్ కంప్లీట్ చేసాడని official గా ట్విట్టర్ ద్వారా కంఫర్మ్ చేసాడు…

ఇలా మూడు సినిమాలను క్లియర్ చేసేసిన పవన్ ఇప్పుడు పూర్తిగా తన దృష్టిని రాజకీయాలపైనే సెట్ చేయనున్నారు. సినిమాలు – రాజకీయాలు రెండింటినీ సమానంగా మేనేజ్ చేయడం అంత సులభం కాదు. కానీ పవర్‌స్టార్ తన స్టైల్‌లో అది సాధించి చూపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *