Native Async

జటాధరా మరో మిరాయి అవుతుందా???

Sudheer Babu's Jatadhara
Spread the love

తేజ సజ్జ మిరాయి తో మన దేవుళ్ళ కథలు మన ప్రేక్షకుల పై ఎంతగా ప్రభావం చూపుతున్నాయి తెలిసిపోయింది కదా… అలాగే ఇప్పుడు మిరాయి 2 ఇంకా హను-మాన్ 2 లైన్ లో ఉన్నాయ్. అలానే కంటారా ప్రీక్వెల్ ఇంకా అలాగే మన మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర సినిమా కూడా రిలీజ్ అవుతుంది నెక్స్ట్ ఇయర్. అయ్యో మనం రామాయణం మర్చిపోతే ఎలా??? ఆ సినిమా కూడా నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అవుతుంది…

ఐతే ఈ సినిమాలన్నిటి మధ్యలో సుధీర్ బాబు జటాధరా కూడా మంచి బజ్ తెచ్చుకుంది. తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్న మరో మైథాలజికల్ థ్రిల్లర్‌ – జటాధర. ఈ సినిమాతో హీరో సుధీర్ బాబు యోధుడి పాత్ర లో కనిపించబోతున్నారు. ఇంకా విశేషం ఏంటంటే, బాలీవుడ్ స్టార్ సోనాక్షి సిన్హా ఈ చిత్రంతో తన టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుంది.

ఆల్రెడీ మనం టీజర్ చూసాం కదా… దాంట్లో సోనాక్షి విశ్వరూపం చూపించి చంపేసింది. ఈ సినిమా లో సోనాక్షి ధన పిశాశి గా కనిపించి ఆమ్మో అనిపించేలా అదరగొట్టింది…

అభిషేక్ జైస్వాల్, వెంకట్ కల్యాణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి విడుదలైన మోషన్ పోస్టర్ ఇప్పటికే విపరీతమైన హైప్ క్రియేట్ చేసింది. లార్డ్ శివుడి కనెక్షన్‌తో సుధీర్ బాబు కనిపించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకుల్లో భారీగా ఆశలు రేపింది. ఒక భయంకరమైన శక్తి, ఒక దివ్యశక్తి మధ్య జరిగే యుద్ధమే ఈ సినిమా హృదయం అని మేకర్స్ చెబుతున్నారు.

“భారతీయ సాంప్రదాయాలు, జానపద కథల లోతు, దివ్య శక్తి – చీకటి మధ్య యుద్ధం” అనే కాన్సెప్ట్ తో జటాధర ఒక అద్భుతమైన విజువల్ స్పెక్టకిల్ అవుతుందని మేకర్స్ హామీ ఇస్తున్నారు.

ఇకపోతే, ఈ సినిమాను ఉమేష్ కుమార్ బన్సాల్ నిర్మిస్తున్నారు. ఆయన మాటల్లో చెప్పాలంటే – “జటాధర ఒక అరుదైన అనుభవం. భావోద్వేగంగా శక్తివంతమైనది, విజువల్‌గా మరపురాని మాయాజాలం”.

సినిమా రిలీజ్ డేట్ ఇప్పటికే లాక్ చేశారు – 2025 నవంబర్ 7. ఆ రోజు ప్రేక్షకులు ఒక మైథాలజికల్ గ్రాండియర్‌కి సాక్ష్యం చెప్పబోతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *