తెలుగు సినిమాల్లో ఎప్పుడైనా యంగ్ టాలెంట్ ఒక మంచి సినిమా తీస్తే అందరు మంచి గా పొగిడేస్తారు, సపోర్ట్ కూడా ఇస్తారు. ఇప్పుడు మౌళి, శివాని, నిఖిల్, జయ కృష్ణ నటించిన లిటిల్ హార్ట్స్ సినిమా కి అదే సపోర్ట్ కనిపిస్తుంది… ఈ సినిమా రిలీజయ్యి ఆల్రెడీ మూడు వారాలైనా ఇంకా ఈ సినిమా కి సపోర్ట్ వస్తూనే ఉంది. ఇప్పటికే చాల మంది సెలబ్రిటీస్, యాక్టర్లు ఈ సినిమా గురించి సోషల్ మీడియా లో పాజిటివ్ రివ్యూస్ షేర్ చేసారు. ఇక ఇప్పుడు రామ్ చరణ్ పెద్ది సినిమా డైరెక్టర్ బుచ్చి బాబు సన కూడా ఈ సినిమా చూసి, టీం అందరిని మెచ్చుకున్నారు…
లిటిల్ హార్ట్స్ టీం కూడా ఈ వీడియో ని షేర్ చేసి డైరెక్టర్ బుచ్చి బాబు కి థాంక్స్ చెప్పారు…
అలానే, ఈ సినిమాలో రాజీవ్ కనకాల కూడా మంచి పాత్ర చేసారు. అందుకే సినిమా ప్రొమోషన్స్ లో భాగంగా, “కాత్యాయిని…” పాట కి మంచి ఫన్నీ రీల్ చేసాడు, తన భార్య Suma Kanakala ఇంకా అత్తగారితో కలిసి… ఆ రీల్ కూడా సోషల్ మీడియా లో తెగ ట్రెండ్ అవుతుంది…
మీరు కూడా చూసేయండి…
ఇక సినిమా కలెక్షన్స్ విషయానికి వస్తే ఇప్పటికే 30 కోట్లు దాటేసి, మంచి మైల్ స్టోన్ మార్క్ కోసం వెయిట్ చేస్తుంది…
