సమాధానం లేని ప్రశ్నలు ఉండవు. పరిష్కారాలు లేని సమస్యలు ఉండవు. మనం తెలుసుకోవలసిందల్లా అసలు సమస్యల ఎక్కడుంది. ఎలా ఉంది. ఎందుకు ఉంది అన్నది. మన జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యకు ఒక మూలకారణం ఉంటుంది. మన ఆలోచనలు కావొచ్చు, పూర్వ జన్మ కర్మలు కావొచ్చు. సమకాలీన వాతావరణం కావొచ్చు. లేక మన నియంత్రణలో లేని శక్తుల ప్రభావం కావొచ్చు. మనుషులు సాధారణంగా సమస్య వస్తే బయటకి చూడటం మొదలుపెడతారు. అతనే నాకు నష్టం చేశాడు. ఇంకో వాళ్ల వలన ఇలా జరిగింది అనే ఆరోపణలు కూడా ఉంటాయి.
కానీ, ఆధ్యాత్మికత చెప్పు మొదటి సత్యం ఏమంటే సమస్యలకు మూలం నాలోనే ఉంది అని అంగీకరించడమే మొదటి మెట్టు. కర్మ సిద్దాంతాన్ని ప్రతి ఒక్కరూ తప్పకుండా అంగీకరించాల్సిందే. ప్రతి చర్యకి ఫలితం అనేది తప్పకుండా ఉంటుంది. మనం గతంలో చేసిన కార్యాలు సమస్యల రూపంలో తిరిగి వస్తాయి. దీనిని తప్పకుండా అంగీకరించి తీరాల్సిందే. ఆ సమస్యలు ఏ రూపంలో అయినా ఉండొచ్చు. ముందుగా చెప్పుకున్నట్టుగా మూలం నాలోనే ఉందనే ఎరుకతో ఉన్నప్పుడు ఆ సమస్యలకు మనకు తప్పకుండా పరిష్కారం దొరుకుతుంది. మూలం తెలిస్తే దానికి మందు వేయవచ్చు. మన జీవితం మనకే పరిమితం అని భావించకుండా పదిమందికి ఉపయోగపడేలా ఉండాలని కోరుకోవాలి. సద్గురువులతో మమేకం అవుతుండాలి. అప్పుడు ఎటువంటి సమస్యకైనా పరిష్కారం లభిస్తుంది.