చరిత్రను నెలకొల్పడం అంటే కష్టమేమోగాని, అదే చరిత్రను భూస్థాపితం చేయడం చిటికెలో పని. చరిత్ర కావొచ్చు లేదా ఒక నిర్మాణం అయినా కావొచ్చు. ఏదైనా సరే నిర్మించడం చాలా కష్టం…కూల్చడం తేలిక.
సపోజ్ ఒక భారీ నిర్మాణం ఉంటే దానిని ఇప్పుడున్న టెక్నాలజీని ఉపయోగించి క్షణాల్లో కూల్చివేస్తున్నారు. కానీ, కూల్చిన తరువాత వెలువడే డస్ట్, శిథిలాలను తొలగించడం చాలా కష్టం. శిథిలాలంటే తొలగిస్తాం. కానీ, డస్ట్ లేకుండా కూల్చడమే సవాల్. దీనికి ఓ పరిష్కారం కనుగొంది జర్మన్ కంపెనీ.
నిర్మాణాన్ని కూల్చివేసే ప్రాంతంలో వాటర్ ను ఫౌంటైన్ మాదిరిగా ఏర్పాటు చేశారు. ఫౌంటైన్ వాటర్ ఒక్కసారిగా పైకి లేవగానే నిర్మాణం బ్లాస్ట్ అవుతుంది. క్షణాల్లో నిర్మాణం కూలిపోతుంది. కూలిన నిర్మాణం నుంచి డస్ట్ బయటకు రాకుండా వాటర్ అడ్డుకుంటుంది. కూల్చివేయాల్సిన నిర్మాణం సైజ్ ను అనుసరించి వాటర్ అవసరమౌతాయి. దానికి తగిన ఫోర్స్ కూడా అప్లయ్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇది ఖర్చుతో కూడుకొని ఉంటుంది. భవిష్యత్తులో సరళతరం అయితే బెటర్.