కేజీఎఫ్ సిరీస్, సలార్, కాంతార వంటి పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్ సినిమాలను అందించిన హోంబలే ఫిల్మ్స్, ఇప్పుడు మరో భారీ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తోంది. అదే ‘కాంతార చాప్టర్ 1’. ఇప్పటికే కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన కాంతార: ది లెజెండ్ సినిమాకు ఇది ప్రీక్వెల్‌గా రాబోతుండటం విశేషం.
ఈ చిత్రాన్ని రిషబ్ శెట్టి స్వయంగా రైటర్-డైరెక్టర్‌గా రూపొందించడమే కాకుండా ప్రధాన పాత్రలో కూడా నటిస్తున్నారు. రిషబ్ ఇప్పటికే తన నటనతో నేషనల్ అవార్డు గెలుచుకున్న విషయం తెలిసిందే. అందువల్ల ఆయన మరోసారి పెద్ద తెరపై మంత్ర ముగ్దులను చేయబోతున్నారని ప్రేక్షకుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో మేకర్స్ తాజాగా సెప్టెంబర్ 22న మధ్యాహ్నం 12:45 గంటలకు ట్రైలర్ విడుదల కానుందని అధికారికంగా ప్రకటించారు.
ఈ చిత్రంలో రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఆమె పాత్ర ఎంతో కీలకంగా, కొత్తగా ఉండబోతుందనే టాక్ ఉంది. సెట్ డిజైన్స్, విజువల్స్, మ్యూజిక్ అన్ని కలిపి ఈ సినిమా మరో మైలు రాయిగా నిలుస్తుందనే నమ్మకం హోంబలే ఫిల్మ్స్‌కి ఉంది.

చివరగా, ఈ మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా సినిమా అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. కాబట్టి కాంతార చాప్టర్ 1 ట్రైలర్‌తో మొదలైన ఈ ఉత్సాహం, రిలీజ్ వరకు ఇంకా పెరిగే అవకాశమే ఎక్కువ.