ఇది కదా మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే… అరే రాజకీయాల్లో బిజీ అయ్యారు… డిప్యూటీ CM అయ్యారు అనుకున్నాం. హరి హర వీర మల్లు వచ్చింది కానీ అంతలా ఇంప్రెస్స్ చేయలేదు. కానీ ఇప్పుడు వస్తుంది చుడండి OG … అబ్బా ట్రైలర్ చూసేయండి ఫస్ట్ ఆ తరువాత మిగితాది మాట్లాడుకుందాం!
చూసారా… ఇది చాలదు అను కున్నారు కదా! ఫస్ట్ లో పాట బొంబాయి లో జరుగుతున్నా అరాచకాలు చూపించి, ఇమ్రాన్ హష్మీ ని డాన్ గా పరిచయం చేసి, అటు అండర్ వరల్డ్ ఇటు పాలిటిక్స్ ని చక్రం తిప్పేలా ఉంది అతని రోల్.
మరి అతని అరాచకాలని ఆపేది ఎవరు… ఉన్నాడు గా ఆ ఒక్కడు మన ఓజాస్ గంభీర! ఎక్కడో భార్య పిల్లలతో సైలెంట్ గా బ్రతుకుతున్న అతన్ని మళ్ళి బొంబాయి కి రప్పించి మళ్ళి నెత్తిన పిడుగు పడేటట్టు చేసుకున్నాడు మన ఇమ్రాన్. సో, మరి వాళ్ళిద్దరి ఫైట్ ని పెద్ద తెర మీదే చూడాలి…
ఇక పవన్ కళ్యాణ్ డైలాగ్స్, ఆహార్యం, స్టైల్, స్వాగ్, “అబ్బో అబ్బో అబ్బో…” అనే పాట గుర్తొస్తుంది మాస్టారు!
ఇప్పటికి ఇంతే… మొత్తం సినిమా ని చూడాలంటే మనం 25th వరకు ఆగాల్సిందే కదా…