Native Async

బిగ్ బాస్ తెలుగు 9లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ…

Bigg Boss 9 Telugu Wild Card Contestants Revealed | Season 9 Updates
Spread the love

తెలుగు బిగ్ బాస్ సీజన్లో 9 అద్భుతంగా సాగుతోంది… నిన్నే సెకండ్ వీక్ ఎలిమినేషన్ జరిగింది! కామన్ మాన్ కోటా లో ఎంట్రీ ఇచ్చిన మర్యాద మనీష్ ఎలిమినేట్ అయ్యాడు. ఐతే ఈ వీక్ డబల్ ఎలిమినేషన్ అన్నారు కానీ జరగలేదు…

ఐతే ఆల్రెడీ షో స్టార్ట్ అయ్యి మూడో వారం లోకి ఎంట్రీ లంచం కాబట్టి, ఇప్పుడు నెక్స్ట్ వీక్ వైల్డ్ కార్డు ఎంట్రీస్ ఉంటాయి అని అంటున్నారు. మరి ఆ కథేంటో చూద్దామా:

షో మొదటి రోజునుంచే సెలబ్రిటీస్ వర్సెస్ కామనర్స్ కాన్సెప్ట్ పాజిటివ్‌గా క్లిక్‌ అవడంతో షోపై అంచనాలు భారీగా పెరిగాయి. ఇప్పుడు ఆ ఉత్సాహాన్ని కొనసాగించేందుకు నిర్వాహకులు మళ్లీ వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ప్లాన్ చేస్తున్నారు. లేటెస్ట్ బజ్ ప్రకారం, ఐదుగురి నుండి ఏడు మంది వరకూ కొత్తగా ఎంట్రీ ఇవ్వబోతున్నారని సమాచారం.

వచ్చే వారాంతానికల్లా కనీసం ఇద్దరు కొత్త కంటెస్టెంట్స్‌ ఇంట్లోకి అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయని టాక్‌. అంతేకాదు, ఈ వారం డబుల్ ఎలిమినేషన్ కూడా జరుగుతుందని, అదే కొత్త ఎంట్రీలకు దారితీస్తుందని బిగ్‌బాస్ వర్గాల నుంచి వినిపిస్తోంది.

వైల్డ్ కార్డ్ ఎంట్రీల లిస్ట్‌లో సీరియల్ యాక్ట్రెస్ సుహాసిని పేరు ముందుంది. టెలివిజన్‌ ద్వారా కుటుంబ ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉన్న ఆమె ఎంట్రీ ఇవ్వడం ఖాయమని అంటున్నారు. అలాగే, గత సీజన్‌లో ఒక కంటెస్టెంట్‌తో లింక్ అయిన సీరియల్ యాక్ట్రెస్ కావ్య కూడా ఈసారి హౌస్‌లోకి వచ్చే అవకాశముందని సమాచారం. యూత్‌ ఆడియన్స్‌లో ఆమెకూ గట్టి ఫాలోయింగ్ ఉంది.

అలాగే, టీవీ సీరియల్స్, యూట్యూబ్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న శివకుమార్ కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నాడని చెప్పుకుంటున్నారు.

ఇక అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్యగా ఫేమస్ అయిన రమ్య మోక్ష కన్చర్ల ఎంట్రీ కూడా ఖాయమని అంటున్నారు. మొదటి రౌండ్‌లోనే రానున్న ఆమెను ఇప్పుడు వైల్డ్ కార్డ్‌గా పంపడం వ్యూహమని తెలుస్తోంది. అలాగే, రాజకీయ వర్గాల్లో సెన్సేషన్ అయిన దివ్వెల మాధురి కూడా ఈ సీజన్‌లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

వీటితో పాటు, వాహ్ చెఫ్ సంజయ్ తుమ్మా లేదా ఎవరైనా పాత కంటెస్టెంట్‌ను కూడా తీసుకురావాలని నిర్వాహకులు ఆలోచిస్తున్నారని టాక్‌. సీజన్ 6లో ఫేమస్ అయిన అమర్‌దీప్ చౌదరి కూడా చర్చల్లో ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో బిగ్‌బాస్ హౌస్‌లో మజా మరింత పెరగడం ఖాయం!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *