సూపర్ హీరో తేజ సజ్జ హీరోగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో వచ్చిన మిరై బ్లాక్ బస్టర్ గా దూసుకుపోతోంది. ఇప్పటికే సుమారు రూ.140 కోట్ల వసూళ్లు సాధించి, 2025లోని పెద్ద హిట్స్ లో ఒకటిగా నిలిచే అవకాశం ఉంది.
ఇక మరోవైపు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన They Call Him OG రేపు వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంలోనే మిరై టీం ఒక అరుదైన నిర్ణయం తీసుకుంది. పవన్ కళ్యాణ్ సినిమా విడుదల రోజు, దేశవ్యాప్తంగా ఉన్న అన్ని స్క్రీన్లు కేవలం OGకే కేటాయించనున్నారు.

అయితే, శుక్రవారం నుండి మళ్లీ మిరై తిరిగి అన్ని థియేటర్లలో ప్రదర్శించబడుతుంది. ఇదిలా ఉండగా, దసరా సెలవులు ఇప్పటికే మొదలవ్వడం ఈ రెండు సినిమాలకు కూడా పెద్ద లాభం అవుతుంది. సంక్రాంతి సీజన్‌లాగే, దసరా కూడా టాలీవుడ్ కి గోల్డెన్ సీజన్.

మరికొక విషయం ఏమిటంటే, మిరైలో తాజాగా జోడించిన ‘వైబ్ ఉంది’ సాంగ్ బాక్సాఫీస్ రన్‌ని మరింత పెంచబోతోందనే అంచనాలు ఉన్నాయి.