పవన్ కళ్యాణ్ హీరోగా, సుజిత్ దర్శకత్వంలో వచ్చిన OG బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా పాజిటివ్ రెస్పాన్స్‌నే వస్తోంది. అయితే AP మాజీ మంత్రి అంబటి రాంబాబు మాత్రం ఈ సినిమాపై నెగటివ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆయన రివ్యూ ప్రకారం ఈ సినిమా హిట్ కాదని, ఫెయిల్యూర్ అని స్పష్టంగా చెప్పారు.
సినిమా విడుదలకు ముందే అంబటి రాంబాబు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ, ఈ సినిమా పెద్ద హిట్ కావాలని ఆకాంక్షించారు. విడుదలకు ముందే బెస్ట్ విషెస్ కూడా తెలియజేశారు. నిర్మాత దానయ్య కి దండిగా డబ్బులు రావాలి అని అన్నారు… కానీ ఇప్పుడు మాత్రం అభిమానులే ఇష్టపడుతున్నారే తప్ప, న్యూట్రల్ ఆడియెన్స్ మాత్రం ఈ సినిమా ఆస్వాదించలేకపోయారని అన్నారు.
తాను చెప్పిన మాటలకు పవన్ అభిమానులు అభ్యంతరం చెప్పవచ్చని అంబటి అన్నారు. కానీ నిజం జీర్ణించుకోలేకపోవడం వారి అవివేకం అవుతుందని తేల్చి చెప్పారు.
తన రాజకీయ ప్రత్యర్థి పవన్ కళ్యాణ్ సినిమా అయినప్పటికీ, ఈ సినిమా హిట్ కావాలని నిజంగా కోరుకున్నానని, కానీ ఫలితం మాత్రం నిరాశపరిచిందని అంబటి రాంబాబు పోస్ట్ చేసాడు…