Native Async

నాని తో సుజిత్… అది కూడా ఒక డార్క్ కామెడీ ఎంటర్టైనర్!

Sujeeth Plans Dark Comedy with Nani After OG Success
Spread the love

సుజీత్… ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలు మాట్లాడుకునేది ఈ టాలెంటెడ్ డైరెక్టర్ గురించే! మన పవన్ కళ్యాణ్ ని అంత అందంగా, స్టైలిష్ గా, అదిరిపోయే OG గ్యాంగ్స్టర్ గా చూపించింది సుజీత్ కదా!

మరి OG సెకండ్ పార్ట్ కూడా ఉంటుందని లీడ్ ఇచ్చారు సినిమా ఎండింగ్ లో లీడ్ ఇచ్చారు కదా… ఐతే సుజీత్ నెక్స్ట్ సినిమా ఏంటి అంటే, నెక్స్ట్ నాని తో సినిమా అని అంటున్నారు… కానీ సుజీత్ కేమో ఒక డార్క్ కామెడీ ఎంటర్టైనర్ చేయాలనీ ఉంది అన్నాడు…

సుజిత్ తన కెరీర్‌ను శర్వానంద్ హీరోగా వచ్చిన రన్ రాజా రన్ తో ప్రారంభించారు. ఆ తర్వాత ప్రభాస్‌తో సాహో, ఇప్పుడు పవన్‌తో OG చేశారు. మొదటి సినిమా ఫుల్ ఎంటర్టైనింగ్ కామెడీ డ్రామాగా ఉండగా, తర్వాతి రెండు మాత్రం సీరియస్ యాక్షన్ డ్రామాలుగా వచ్చాయి. అయితే ఇప్పుడు సుజిత్ దృష్టి డార్క్ కామెడీపై పడింది.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన సుజిత్—“ఇప్పుడిప్పుడే ఒకే తరహా సినిమాలు ఎక్కువ అవుతున్నాయి. అందుకే కొత్తగా ఫన్ ఫిల్మ్స్ చేయాలని ఉంది. నిజానికి, నెల్సన్ సినిమాలు చూసినప్పుడు మనం కూడా అలాంటి ఫన్ మూవీస్ ఎందుకు చేయకూడదు అనిపిస్తుంది. యాక్షన్ సినిమాలు చేస్తే అందరూ సీరియస్‌గా ఉంటారు. కానీ కామెడీ సినిమాలు చేస్తే సెట్‌లోనూ, ఆడియెన్స్‌కీ సరదానే ఉంటుంది” అని తెలిపారు. తన తదుపరి సినిమా ఎలాంటి డిలే లేకుండా వచ్చే ఏడాదిలోనే విడుదల అవుతుందని కూడా హామీ ఇచ్చారు.

ఇక మరోవైపు, నాని తదుపరి సినిమా సుజిత్ దర్శకత్వంలోనే ఉంటుందని వార్తలు వస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ దసరా కానుకగా లాంచ్ కానుందని టాక్. సుజిత్ ప్రస్తావించిన డార్క్ కామెడీ సినిమా ఇదే అని సమాచారం.

ప్రస్తుతం ప్రచారంలో ఉన్నట్లుగా ఇది యాక్షన్ ఎంటర్‌టైనర్ కాదని, చమత్కారంగా, విభిన్నంగా ఉండే డార్క్ కామెడీ ఎంటర్‌టైనర్ అవుతుందని తెలుస్తోంది. అయితే యాక్షన్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయని చెబుతున్నారు. స్క్రిప్ట్ పూర్తయ్యిందని, మొత్తం సినిమాను యూరప్‌లో ఒకే షెడ్యూల్‌లో షూట్ చేయాలని సుజిత్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *