కొన్ని రోజుల క్రితం సాయి పల్లవి తన సోదరి పూజాతో కలిసి హ్యాపీగా వెకేషన్ ఎంజాయ్ చేస్తూ ఉన్న కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అసలు ఆ ఫొటోలు పూజానే తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. అయితే, వాటిలో కొన్ని పిక్స్‌ను కొందరు చెడుగా మోర్ఫ్ చేసి, సాయి పల్లవి బికినీ వేసుకున్నట్టుగా చూపించే ప్రయత్నం చేశారు.
https://www.instagram.com/p/DOyWSvtkfAv/?hl=en&img_index=1
ఈ వార్తలు బయటకు రావడంతో సాయి పల్లవి కూల్‌గా, హాస్యప్రధానంగా స్పందించింది. తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త రీల్‌ని షేర్ చేస్తూ “ఇవి ఒరిజినల్ ఫొటోలు.. AI జనరేట్ చేసినవి కావు” అని స్పష్టంగా రాసింది. అలాగే బీచ్ వద్ద స్విమ్ సూట్‌లో సరదాగా గడిపిన ఫొటోలు, మరోవైపు వెకేషన్‌లో ఎంజాయ్ చేస్తున్న పిక్స్‌ని కూడా పంచుకుంది.
అంటే స్పష్టంగా చెప్పాలంటే అసలైన ఫొటోలు ఇవే, కానీ ఇటీవల బయటకు వచ్చిన బికినీ ఫొటోలు మాత్రం AI మోర్ఫ్ చేసినవే. సాయి పల్లవి చేసిన ఈ క్లారిఫికేషన్‌కి ఫ్యాన్స్ ఫిదా అవుతూ, ట్రోల్స్‌కి స్ట్రాంగ్ రిప్లై ఇచ్చిందంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. నిజానికి గాసిప్స్ అన్నీ తుడిచిపెట్టి, తన స్టైల్‌లోనే పర్ఫెక్ట్ కౌంటర్ ఇచ్చినట్టైంది.