Native Async

OG ప్రీక్వెల్ సీక్వెల్ – రెండు ఒకేసారి షూట్ చేయాలనీ డైరెక్టర్ ప్లాన్…

Director Sujeeth Hints at OG Sequel and Prequel Plans – A New Pawan Kalyan Cinematic Universe?
Spread the love

OG సినిమాకి రెండో భాగం ఉంటుందా? లేక ప్రీక్వెల్ వస్తుందా? అనే ప్రశ్నకి దర్శకుడు సుజీత్ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర సమాధానం ఇచ్చారు. చివర్లో పవన్ కల్యాణ్ కథ పూర్తి స్థాయిలో చూపించలేదని, ఇది కేవలం శాంపిల్ మాత్రమేనని సుజీత్ క్లారిఫై చేశారు. జపాన్ బ్యాక్‌స్టోరీ, అర్జున్ దాస్ పాత్ర పోర్ట్‌ ను టేకోవర్ చేసిన తర్వాత జరిగే సన్నివేశాలు ఇంకా బయటపెట్టలేదని చెప్పారు.

ఇక, మ్యూజిక్ డైరెక్టర్ థమన్ మాత్రం OG యూనివర్స్ మరో పదేళ్లు నిలబడగలదని చెప్పి ఫ్యాన్స్ కి కొత్త ఆశలు కలిగించారు. ఈ ప్రాజెక్ట్‌ని బాహుబలి లా ఒకేసారి ప్రీక్వెల్, సీక్వెల్ తీసి రిలీజ్ చేయాలని సుజీత్ ఆలోచనలో ఉన్నారు.

అయితే, ఫ్యాన్స్ మాత్రం ఒకే డిమాండ్ చేస్తున్నారు – “ఉస్తాద్ భగత్ సింగ్ తర్వాత అయినా పవన్ కల్యాణ్ గారు OG కి డేట్స్ ఇవ్వాలి” అని. కానీ, ఆయన పొలిటికల్ ఇంకా అడ్మినిస్ట్రేటివ్ వర్క్ మధ్యలో ఇది సాధ్యమవుతుందా అనేది చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *