OG …OG …OG ఇప్పుడు మొత్తం థియేటర్స్ అన్ని ఈ సినిమాతోనే నిండిపోయాయి… ఒక పక్క దసరా, ఇంకో పక్క హాలిడేస్, ఇంకా సినిమా ఫస్ట్ డే నే పోస్టివ్ టాక్ తెచ్చుకోవడం… మొత్తానికి అన్ని కలిసి వచ్చాయి ఈ సినిమా కి. ఐతే ఇప్పటి వరకు సినిమా ని ఫాన్స్ చూసారు… ఎందుకంటే సినిమా టికెట్ రేట్ దాదాపు 500 ఉండేది… సో, ఒక ఫామిలీ సినిమా చూడాలంటే 2000 అయిపోతాయి… సో, కొందరు ఇంకా చూడాలి…
ఇప్పుడు ఆ ప్రాబ్లెమ్ లేదు… సినిమా టికెట్ రేట్స్ ఇప్పుడు నార్మల్ అయిపోయాయి… ఐతే వీక్‌డేస్ మొదలయ్యాక, టికెట్ రేట్లు తగ్గుతాయని అందరూ అనుకున్నారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ, నిజాం డిస్ట్రిబ్యూటర్లు సోమవారం కూడా అదే హైక్ చేసిన రేట్లను కొనసాగించారు.
ఇంతలోనే, సోమవారం సాయంత్రం తెలంగాణ ప్రభుత్వం ఒక పెద్ద షాక్ ఇచ్చింది. OG కోసం ఇచ్చిన టికెట్ హైక్ G.O.ని రద్దు చేస్తూ, వెంటనే అమలులోకి తీసుకురావాలని ఆదేశాలు జారీ చేసింది. ఇకపై రాష్ట్రంలోని అన్ని సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్సులు ప్రత్యేక టికెట్ ధరలను రద్దు చేయాల్సిందే.
దీంతో OG టికెట్ రేట్లు మళ్లీ సాధారణ స్థాయికి వచ్చేశాయి – సింగిల్ స్క్రీన్‌లో రూ.175, మల్టీప్లెక్స్‌లో రూ.295. ఈ నిర్ణయం వల్ల సినిమా కి స్టడీగా, ఎక్కువ రోజులు రన్ అవ్వడానికి అవకాశం ఉంటుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. అంతేకాక, ఇప్పటికే బ్రేక్ ఈవెన్ దగ్గరగా ఉన్న OG కి ఈ నిర్ణయం ఊపందిస్తుందని విశ్లేషకులు అంటున్నారు.
ఇక, తెలంగాణ హైకోర్టు ప్రభుత్వం ఇచ్చిన టికెట్ హైక్ G.O.పై సీరియస్‌గా ఉన్న సంగతి తెలిసిందే. ఇదే కారణంగా ప్రభుత్వం తక్షణమే టికెట్ రేట్ల పెంపును రద్దు చేయాల్సి వచ్చింది.